Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

ఏపీలో అధికార, ప్రతిపక్షాలు దొందూ దొందే: సుజనా చౌదరి

నాలుగు నెలల వైసీపీ ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం పనుల్లో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. టెండర్ల విషయంలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలను పాటించారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ సర్కారుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ గతంలో ఎందుకు రేటు తగ్గించి టెండర్ వేసిందని ప్రశ్నించారు. పీపీఏల రద్దు వల్ల ఏపీకి కొత్తగా పరిశ్రమలు రాకపోవడమే కాకుండా దేశానికే చెడ్డపేరు వస్తుందని తెలిపారు. వైఎస్ హయాంలో భూసేకరణ పూర్తయితే ఇంత సాగదీత ఉండేదికాదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల కల్పనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

ఏపీని పార్టీలు, కులాలు, మతాలుగా విభజించి పరిపాలన చేస్తారా అని నిలదీశారు. ఏపీని లా లెస్ రాష్ట్రంగా మారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయాలని. ప్రాజెక్టులో 67 శాతం పనులు పూర్తయినట్లు గత ప్రభుత్వం వెల్లడించిందని.. మిగతా ఏయే పనులు పెండింగ్‌లో ఉన్నాయనే అంశంపై ప్రజలకు వివరించాల్సిన అవసరముందన్నారు. చంద్రబాబు అద్దెకు ఉన్న ఇంటి చుట్టే రాజకీయం అంతా తిప్పడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు దొందూ దొందే అన్నట్టు ఉన్నాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లలో గతంలో ఎల్‌2గా వచ్చిన సంస్థ ఈసారి తక్కువ ధరకే బిడ్‌ వేసిందంటే అందులోని లోగుట్టు చెప్పాలని ప్రభుత్వాన్ని సుజనా నిలదీశారు.