బీజేపీలోకి సింధియా ఎంట్రీకి లైన్ క్లియర్ స్పాట్.. జేపీ.నడ్డా కుమారుడి పెళ్లి రిసెప్షన్

మాజీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడానికి మూడు రోజుల క్రితమే రంగం సిధ్ధమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ, నడ్డా కుమారుడు గిరీష్ నడ్డా పెళ్లి రిసెప్షన్ ఇందుకు వేదికయ్యింది.

బీజేపీలోకి సింధియా ఎంట్రీకి లైన్ క్లియర్ స్పాట్.. జేపీ.నడ్డా  కుమారుడి పెళ్లి రిసెప్షన్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 11, 2020 | 12:54 PM

మాజీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడానికి మూడు రోజుల క్రితమే రంగం సిధ్ధమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ, నడ్డా కుమారుడు గిరీష్ నడ్డా పెళ్లి రిసెప్షన్ ఇందుకు వేదికయ్యింది. ఈ విందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తదితర నేతలంతా హాజరయ్యారు. అక్కడే బీజేపీలో సింధియా ఎంట్రీకి అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పైగా అదే సందర్భంలో శివరాజ్ సింగ్ చౌహాన్.. మధ్యప్రదేశ్ రాజకీయ పరిణామాలను, కాషాయ కండువా కప్పుకోవడంపట్ల సింధియా సానుకూల వైఖరిని పార్టీ నాయకులకు వివరించారని తెలిసింది. మంగళవారం ఉదయం దేశమంతా హోలీ పండుగ జరుపుకుంటున్న వేళ.. సింధియా.. అమిత్ షాను కలుసుకోవడం, ఇద్దరూ కలిసి 7.. లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని మోదీ నివాసానికి వెళ్లడం జరిగిందట. ఆ భేటీలో ఏం జరిగిందో తెలియదు గానీ.. మోదీ, షా ఇద్దరూ సింధియాతో కీలక చర్చలు జరిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఈ 49 ఏళ్ళ యువనేతను ఆ పార్టీ చిన్న చూపు చూస్తోందని, మధ్యప్రదేశ్ లో ఈయనను పట్టించుకోవడంలేదన్న విషయాన్ని బీజేపీ వర్గాలు మోదీ, షాల దృష్టికి తీసుకువచ్చినట్టు సమాచారం. అసలు సింద్జియా మాటలను కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గానీ, సోనియా గాంధీ గానీ ఓపికగా ఆలకించే అవకాశమే లేకపోయిందన్న అంశం కూడా ఇద్దరు ప్రధాన నేతలకూ తెలియవచ్చిందట. అందుకే సింధియా.. సోనియాకు రాసిన తన రాజీనామా లేఖలో.. పార్టీని వీడే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో