ఆమెకు ఆ అర్హత లేదు, రియా చక్రవర్తిపై బిహార్ డీజీపీ

సుశాంత్ కేసులో తమ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై వ్యాఖ్యానించే అర్హత సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి లేదని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యానించారు. ఈ కేసులో..

ఆమెకు ఆ అర్హత లేదు, రియా చక్రవర్తిపై బిహార్ డీజీపీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2020 | 5:20 PM

సుశాంత్ కేసులో తమ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై వ్యాఖ్యానించే అర్హత సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి లేదని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యానించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీహార్ ప్రభుత్వం, పోలీసు శాఖ తమ విజయంగా భావిస్తున్న నేపథ్యంలో..పాండే దాదాపు రియాపై విరుచుకపడ్డారు. ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి మార్చాలంటూ రియా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో నితీష్ కుమార్ పేరును కూడా ప్రస్తావించిందని ఆయన అన్నారు. ‘అసలు ఆమెకు ఆయన పేరెత్తే అర్హత ఉందా ?సుశాంత్ తండ్రి కేకే ఖాన్ స్వయంగా తమ సీఎం ని కలిసి తనకు, తన కుటుంబానికి న్యాయం జరగాలని కోరారు. దాంతో సీఎం ఈ కేసును సీబీఐకి రెఫర్ చేస్తూ సిఫారసు చేశారు’ అని పాండే పేర్కొన్నారు.

మా పోలీసులను ముంబై పోలీసులు అవమానించారు, ఒక అధికారిని బలవంతంగా క్వారంటైన్ కి తరలించారు.. మరి… వాళ్ళు ఇప్పుడేమంటారు అని పాండే ప్రశ్నించారు. సీబీఐ ఇన్వెస్టిగేషన్ వల్ల సుశాంత్ కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.