Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సి.ఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించారు. కంటైన్మేంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని నిర్ణయించారు. కంటైన్మంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి పూట కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ కేసు. కేజీహెచ్ లో రెండో రోజు ముగిసిన సీబీఐ విచారణ. కేజీహెచ్ వైద్యాధికారులతో మాట్లాడిన సీబీఐ అధికారి. సీసీ ఫుటేజీని పరిశీలించిన సీబీఐ. 16 న క్యాజువాల్టీలో డాక్టర్ సుధాకర్ కు పరీక్షలు చేసిన కేజీహెచ్ వైద్యులు.
  • ఢిల్లీ లో కరోనా విజృంభన. ఢిల్లీ లో కొత్తగా 1295 కరోనా పాజిటివ్ కేస్ లు ,13 మంది మృతి. ఢిల్లీ రాష్ట్రంలో 19844 కి చేరిన కరోనా కేసులు నమోదు. 473 మంది కరోనా తో మృతి
  • రుతుపవనాలు ఇంకా కేరళ తీరానికి తాకలేదు. దీని పై మేము క్రమం తప్పకుండా మానిటరింగ్ చేస్తున్నాం. జూన్ 1 నుండి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అనుకుంటున్నాం. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ సమీపంలో ఈ రోజు అల్ప పీడనం ఏర్పడింది. జూన్ 2 కి తుఫానుగా మారుతుందని మేము అనుకుంటున్నాం. జూన్ 3 సాయంత్రం నాటికి గుజరాత్ ,ఉత్తర మహారాష్ట్ర తీరం వైపుకు చేరుకుంటుంది. మృత్యుంజయ్ మోహపాత్రా, ఢిల్లీ IMD.
  • జమ్మూ కాశ్మీర్‌లో సీనియర్ ఐఎఎస్ అధికారి కి కరోనా పాజిటివ్‌. ఆయనతో పాటు సమావేశానికి హాజరైన పలువురు అధికారులు,వైద్యులను హోమ్ క్వారంటైన్ లో వెళ్లాలని సూచన.
  • మొబైల్ సేవల కోసం 11 అంకెల నంబరింగ్ ప్లాన్‌ను ట్రాయ్ సిఫారసు చేసినట్లు కొన్ని మీడియా సంస్థల లో వార్తలు వచ్చాయి. TRAI సిఫారసు ప్రకారం,దేశం లో 10-అంకెల నెంబర్ కొనసాగుతుంది. మేము 11-అంకెల నంబరింగ్ ప్లాన్‌కు మార్చడాన్ని ఖండిస్తున్నాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.

తండ్రిని సైకిల్ పై కూర్చుపెట్టుకోని 1200 కిమీ ప్ర‌యాణం…బాలిక‌పై ఇవాంకా ప్రశంసలు..

Beautiful feat: Ivanka Trump on Bihar girl cycling 1200 km with father, తండ్రిని సైకిల్ పై కూర్చుపెట్టుకోని 1200 కిమీ ప్ర‌యాణం…బాలిక‌పై ఇవాంకా ప్రశంసలు..

ప్ర‌స్తుతం క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ నేప‌థ్యంలో వ‌ల‌స కార్మికుల ఎదుర్కొంటున్న క‌ష్టాలు మాటల్లో వ‌ర్ణించ‌లేం. ఎంద‌రో సొంత ఊర్ల‌కు చేరుకోవాల‌ని కాలిన‌డ‌క‌న‌, సైకిళ్ల‌పై  ప‌య‌న‌మ‌వుతున్నారు. ఇటీవ‌ల 15 సంవత్సరాల బాలిక జ్యోతి కుమారి .. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని సైకిల్ మీద కూర్చో బెట్టుకుని 1200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి..తండ్రిపై త‌న ప్రేమ ఏపాటిదో నిరూపించుకుంది. ఆ బాలిక యొక్క ప‌ట్టుద‌ల‌ను చూసి..సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్ర‌శంసించింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సైతం జ్యోతిని ప్రశంసించారు. ఆమె అస‌మాన‌ ప్రతిభను మెచ్చుకున్నారు. ‘గాయంతో ఉన్న తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకుని 7 రోజుల పాటు తొక్కుతూ 1200 కిలోమీట‌ర్ల‌ దూరం ప్రయాణించి సొంత ఊరికి చేరుకుంది. ఆమె అందమైన స‌హ‌నం, ప్రేమ… భారతీయ సొసైటీనే కాకుండా సైక్లింగ్ ఫెడరేషన్‌ను కూడా ఆకట్టుకుంది.’ అంటూ ఇవాంకా ట్రంప్ ట్వీట్ లో పేర్కొన్నారు.


బీహార్ కు చెందిన జ్యోతికుమారి తండ్రితో కలసి గురుగ్రామ్‌లో నివ‌శిస్తోంది. ఆమె ప్ర‌స్తుతం 8వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించ‌డంతో ఆమె తండ్రి ఉపాధి కొల్పోయాడు. దీంతో సొంత ఊరికి వెళ్లి కొంత‌కాలం గ‌డుపుదామ‌ని అనుకున్నారు. జ్యోతి తండ్రి అనారోగ్యంతో ఉండ‌టంతో..అత‌డికి సైకిల్ తొక్కే ప‌రిస్థితి లేదు. ఇక చేసేది లేక తానే ఆ ప‌నికి పూనుకుంది. తండ్రిని వెనుక సైకిల్ పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్ల దూరాన్ని ఏడు రోజుల్లో చేరుకుంది. అంత దూరం ఓ బాలిక సైకిల్ తొక్క‌డం అంటే మాములు విష‌యం కాదు. విష‌యం సోష‌ల్ మీడియా ద్వారా బ‌య‌ట‌కు తెలియ‌డంతో.. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమె ప్రతిభను ప్ర‌శంసించింది. జ్యోతి కుమారిని సైక్లింగ్ ట్రయల్స్‌కు రావాల్సిందిగా కోరింది. ఆమె ట్రయల్స్‌లో సెలక్ట్ అయితే, ట్రైనీగా ఛాన్స్ ఇవ్వ‌నున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ట్రైనింగ్ ఉంటుంది.

Related Tags