బీహార్ ఎన్నికల్లో పీడీఎ సీఎం అభ్యర్థిగా పప్పు యాదవ్

బీహార్ ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ అలయెన్స్ (పీ డీ ఏ) సీఎం అభ్యర్థిగా రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ను ఎంపిక చేశారు. ఇటీవలి వరకు జన్ అధికార్ పార్టీ లోక్ తాంత్రిక్ ప్రెసిడెంట్ అయిన పప్పు యాదవ్ మాధేపురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈయన బహుజన్ సమాజ్ పార్టీతోనూ, సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తోను పొత్తు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని […]

బీహార్ ఎన్నికల్లో పీడీఎ సీఎం అభ్యర్థిగా పప్పు యాదవ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 14, 2020 | 5:36 PM

బీహార్ ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ అలయెన్స్ (పీ డీ ఏ) సీఎం అభ్యర్థిగా రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ను ఎంపిక చేశారు. ఇటీవలి వరకు జన్ అధికార్ పార్టీ లోక్ తాంత్రిక్ ప్రెసిడెంట్ అయిన పప్పు యాదవ్ మాధేపురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈయన బహుజన్ సమాజ్ పార్టీతోనూ, సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తోను పొత్తు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిని అదుపు చేయలేకపోయారని ఆరోపించారు. లాలూ ప్రసాద్ యాదవ్ ని నితీష్ తన ఎన్నికల ఇష్యుగా ఎందుకు చేసుకున్నారని పప్పు యాదవ్ ప్రశ్నించారు.