ఫస్ట్ నామినేషన్.. ఈసారి ఆమె ఎలిమినేషన్ కన్ఫర్మ్.?

Bigg Boss First Nominations To Elimination, ఫస్ట్ నామినేషన్.. ఈసారి ఆమె ఎలిమినేషన్ కన్ఫర్మ్.?

ఎన్నో ట్విస్టులు.. మరెన్నో ఫైట్స్‌తో బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శిల్పా చక్రవర్తి, పునర్నవి భూపాలం, హిమజ, మహేష్ విట్టా, శ్రీముఖిలు ఈ వారం ఎలిమినేషన్స్‌లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్లకు ఓ సెంటిమెంట్ వెంటాడుతోందని చెప్పాలి. అదే ‘ఫస్ట్ నామినేషన్ ఫర్ ఎలిమినేషన్’.. ఎలిమినేషన్ ప్రాసెస్‌లో మొదటిసారి నామినేట్ అయిన వారందరూ హౌస్ నుంచి బయటికి వస్తుండటం ఆనవాయితీగా మారింది.

మొదట హౌస్‌లోకి వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి.. ఫస్ట్ టైం ఎలిమినేషన్స్‌కు నామినేట్ అయి.. బయటికి వచ్చేసింది. ఆ తర్వాత రోహిణి, అషు రెడ్డిలు కూడా మొదటసారే నామినేట్ అయి ఎలిమినేషన్ పాలయ్యారు. ఇక రీసెంట్‌గా అలీ రెజా కూడా ఫస్ట్ టైం అయ్యి.. హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది.

తమన్నా సింహాద్రి అంటే రవికృష్ణకు చుక్కలు చూపించడం.. దుర్భషలాడటం జరిగింది కాబట్టి ప్రేక్షకులకు నచ్చక ఎలిమినేట్ చేశారు. మరి రోహిణి, అలీ రెజాలు హౌస్‌లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయినా ఎలిమినేట్ కావడం సగటు ప్రేక్షకుడికి ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న యాంకర్ శిల్పా చక్రవర్తి కూడా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ ఫస్ట్ నామినేషన్ కంటెస్టెంట్లకు శాపంగా మారిందా లేదా అనేది.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *