Bigg Boss 4 : ఇద్దరు ముద్దుగుమ్మల్లో ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

బిగ్ బాస్4 విజేత ఎవరు అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తునారు.  ఈ వారం ఇంటినుంచి ఒకరు బయటకు వెళ్లనున్నారు.

Bigg Boss 4 : ఇద్దరు ముద్దుగుమ్మల్లో ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

Edited By:

Updated on: Dec 12, 2020 | 9:43 AM

బిగ్ బాస్4 విజేత ఎవరు అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునారు.  ఈ వారం ఇంటినుంచి ఒకరు బయటకు వెళ్లనున్నారు. అఖిల్ ఇప్పటికే టికెట్ టూ ఫినాలే విన్ అయ్యాడు. ఇక అభిజిత్ , సోహెల్ ఇద్దరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మిగిలిన ముగ్గురు అమ్మాయిల్లో ఒకరు ఇంటినుంచి బయటకు వెళ్ళాక తప్పేలా లేదు. వీరిలో అరియానకు ఊహించని విధంగా రాంగోపాల్ వర్మ నుంచి సపోర్ట్ వచ్చింది.

దాంతో ఈ సారి అరియానకు ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటినుంచి అరియానా తన మార్క్ గేమ్ ఆడుతూ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ వస్తుంది. ఈ సారి కూడా అరియానా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే మోనాల్ హారిక ఇద్దరిలో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.  మోనాల్ ను మొదటినుంచి గుజరాతీలు కాపాడుతూవస్తున్నారు. మోనాల్ తెలుగమ్మాయి కాదు కాబట్టి ఈ అమ్మడు త్వరగానే ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అమ్మడికి గుజరాతీలు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.

మరో వైపు ఈ అమ్మడు అఖిల్ తో క్లోజ్ గా ఉండటంతో అతడిని అభిమానించే వారు మోనాల్ కు ఓట్లేసి కాపాడే అవకాశం కూడా ఉందని కొందరు అంటున్నారు. ఇక హారిక విషయానికొస్తే మొదటినుంచి తన గేమ్ తాను ఆడుతూ వస్తుంది. హారికకు సపోర్ట్ చేసేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు. హరికకు మొదటి నుంచి ఓట్లు వేస్తూ ప్రేక్షకులు గెలిపిస్తూ వస్తున్నారు. ఈసారి హరికకు తక్కువ ఓట్లు పడే అవకాశం తక్కువే ఉన్న ఏదైనా గోల్ మాల్ జరిగితే తప్ప హారిక బయటకు వెళ్లే ఛాన్స్ ఉండదని  కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్లో ఎవరు బయటకు వస్తారో చూడాలి.