బిగ్‌బాస్ 4 చివరి దశకు చేరుకోవడంతో టాప్5లో ఎవరు ఉంటారనేది ప్రస్తుతం అందరిలో ఉన్న అనుమానం. అయితే టికెట్ టూ ఫినాలే సాధించిన అఖిల్ మినహా ఈ వారం అభిజిత్, సోహైల్, అరియానా, హారీక, మోనాల్ నామినేషన్స్‌లో ఉన్నారు. హౌస్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఆదివారం ఒకరు ఎలిమినేట్ అయితే మొత్తంగా ఐదుగురు మాత్రమే ఇంట్లో ఉంటారు. ప్రస్తుతం హౌస్‌లో ముగ్గురు ఫీమేల్ కంటెస్టెంట్లు, ముగ్గురు మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు.
ఇకా ఓటింగ్ విషయానికి వస్తే అభిజిత్‌కు ఎలాగు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా అతను టాప్‌లోనే ఉండనున్నాడు. ఆ తర్వాతి స్థానంలో సోహైల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా బిగ్‌బాస్ దత్తపుత్రిక నామినేషన్స్‌లో ఉన్నా లేనట్లే. ఎందుకంటే తనకు ఓట్లు వచ్చినా రాకపోయిన బిగ్‌బాస్ ఆమెను ఎలిమినేట్ చేయడు అనే ఇన్ని రోజులు జరిగిన ఎలిమినేషన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈసారి కూడా మోనాల్ సేవ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇక మిగిలింది అరియానా, హారిక. ఇప్పటి వరకు సూటీగా మాట్లాడుతూ, మేల్ కంటెస్టెంట్లకు పోటీ ఇస్తూ స్ట్రాంట్‌గా గేమ్ ఆడోతూ వస్తుంది అరియానా. దీంతో అరియానాకు కూడా బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇక హారిక ఎప్పుడూ.. తనకు తన ఫ్యాన్స్‌తో పాటు అభిజిత్ ఫ్యాన్స్ కూడా ఓట్లు వేస్తూ హారికను సేవ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వారం చివరి నామినేషన్స్ కావడంతో అభిజిత్ ఫ్యాన్స్ హారికకు బదులుగా అభిజిత్‌కు మాత్రమే ఓట్లు వేసేలా ఉన్నారు. అలా అయితే నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురిలో హారికకు మాత్రమే తక్కువ ఓట్లు వచ్చే విధంగా ఉన్నాయి. దీంతో హారిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది.