తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 షోకు సమంత అక్కినేని, అఖిల్, కార్తికేయ, సుమ ఇలా చాలా మంది సెలబ్రెటీలు వచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమోలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ షోకు వచ్చాడు. అయితే ఆయన వచ్చింది ఒక పని మీద అట. అదేంటంటే….
సుదీప్‌ను బిగ్ బాస్ 4 ఈ షోకు పిలవడానికి ప్రత్యేకంగా కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అదేంటంటే ప్రస్తుతం ఉన్న హౌజ్‌మేట్స్‌లో ఒకర్ని నేరుగా ఫైనల్‌కు పంపించడం. ఆ బాధ్యతను సుదీప్‌పై పెట్టారట నాగార్జున. ప్రస్తుతం ఇంట్లో అవినాష్, అరియానా, అఖిల్, హారిక, మోనాల్, అభిజీత్ ఉన్నారు. అందులో ఈ వారం నామినేషన్స్ నుంచి అఖిల్, మోనాల్ సేవ్ అయ్యారు. అవినాష్, అరియానా డేంజర్ జోన్‌లో ఉండి బయటపడనున్నారు. అవినాష్ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సుదీప్ మాత్రం ఇంట్లో ఓ సభ్యుడికి వే టూ ది ఫినాలే కార్డ్ ఇచ్చినట్లు సమాచారం.
ఎక్కువ సార్లు నామినేట్ అయినందుకే…
అభిజిత్ కు సుదీప్ టికెట్ టు ఫినాలే కార్డు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎక్కువసార్లు నామినేట్ అయిన కారణంగానే అభిజిత్ కు ఈ టికెట్ లభించినట్లు తెలుస్తోంది. అయితే చాలా సార్లు నామినేట్ అయి సేవ్ అయ్యాడంటే అభి ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంటో అర్థమవుతుంది. షో వేదికగా అభిజిత్ ఆటను సుదీప్ పొగిడినట్లు తెలుస్తోంది. అభి మంచి బ్యాలెన్సింగ్‌గా గేమ్ ఆడుతున్నాడని సుదీప్ అన్నట్లు సమాచారం. కాగా, కన్నడ బిగ్ బాస్ షోను సుదీప్ ఏడు సీజన్లుగా విజయవంతంగా హోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం సుదీప్ నటిస్తున్న కన్నడ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.