బిగ్‌బాస్ షో ఫినాలేకు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో కంటెస్టెంట్స్ మరింత కసిగా గేమ్ ఆడుతున్నారు. ఇందుకు బిగ్‌బాస్ కూడా వాళ్ళకు రకరకాల టాస్కులు ఇస్తూ వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్లో ఇలాంటి టాస్కే ఇచ్చారు బిగ్‌బాస్. ఈ టాస్క్ లో మోనాల్, అరియానా మధ్య పెద్ద రచ్చే జరిగింది. ముఖ్యంగా అరియానా మోనాల్ పై ఉన్న కోపాన్ని మొత్తం బయటకు తీసింది. దీంతో మోనాల్ గుక్కపెట్టి ఏడ్చేసింది.
ఓపిక అనే టాస్క్ లో ఇంటి సభ్యులు ఏ హావభావం లేకుండా రోబోట్ లా కూర్చొని ఉండాలని బిగ్‌బాస్ తెలిపారు. అంటే ఒక సభ్యుడు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన టేబుల్ పై రోబోట్ లా కూర్చోవాలి. మిగిలిన ఇంటి సభ్యులు ఏదైనా చేసిన కూర్చున్న సభ్యుడిని వీలైనన్ని ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ బయటకు వచ్చేలా చేయాలి. టాస్క్ ముగిసేసరికి ఏ సభ్యుడు అయితే ఎన్ని ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారో అఖిల్ బోర్డుపై రాయాలి. అంతేకాకుండా టేబుల్ దగ్గర నాలుగు ఎక్స్‌ప్రెషన్స్‌తో కూడిన ఫేస్ బొమ్మలను కూడా ఉంచారు. ఏ ఫేస్ బొమ్మ వెలిగితే ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ను టేబుల్ పై కూర్చున్న వ్యక్తితో మిగిలిన నలుగురు ఇంటి సభ్యులు ఏదైనా చేసి పెట్టించగలగాలి.
ఇందులో మొదటిగా అరియానాకు ఛాన్స్ వచ్చింది. దీంతో ఆమెతో ఎక్స్ ప్రెషన్స్ తెప్పించడానికి సోహైల్, మోనాల్ చాలా ప్రయత్నించారు. కానీ అరియానా మాత్రం తన ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేసుకుంది. ఎలాగైనా అరియానాతో ఎమోషన్స్ తెప్పించడానికి ఆమెకు ఇష్టమైన చింటు బొమ్మను హారిక తీసుకురాగా, ఆ బొమ్మను మోనాల్ బయటకు విసిరెసింది. దీంతో ఆ బొమ్మ ఎక్కడో గోడపై పడింది. అంతేకాకుండా అరియానా డ్రెస్‌లో ఐస్ క్యూబ్ వేసింది. ఇన్ని ప్రయాత్నాలు చేసిన అరియానా మాత్రం 4 ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే ఇచ్చింది.
ఇక మోనాల్ రోబోలా కూర్చోగా అరియానా అప్పటివరకు తన మనసులో దాచుకున్న కోపాన్ని అంతా కక్కేసింది. అవినాష్‌ను తన్ని మరీ ఓ ఎక్స్ ప్రెషన్ ఇచ్చావని. నా మీద ఎంత పగుందో ఇప్పటికైనా బయటపడిందని తెలిపింది. నా బొమ్మను ఇంటి బయట పడేయాలనుకున్నావు. నన్ను బాధ పెట్టాలనుకున్నావు. మనసులో ఇంత పగ ఉన్నప్పుడు నన్ను ముందు ఇన్ని రోజులు నటించావా? అడి అడిగింది. ఇవే కాకుండా ఇంకా చాలా మాటలు అనేసింది. దీంతో మోనాల్ ఓంటరిగా గుక్కపెట్టి ఏడ్చేసింది. బిగ్‌బాస్ ఆమెను ఓదార్చడానికి కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు. మోనాల్ విషయంలో సోహైల్, అరియానా మధ్య పెద్ద గొడవే జరగబోతుంది. ఈ ప్రోమోను నేటి ఎపిసోడ్ చివరిలో చూపించారు. మరి ఆ విషయాలను రేపు బిగ్‌బాస్ ఎపిసోడ్ లో చూడాలి.