బిగ్‌బాస్ ఇచ్చిన ‘రాజారాణి’ టాస్క్‌లో అరియానా బెస్ట్ రూలర్‌గా నిలించింది. దీంతో తనకు సపోర్ట్ చేయమని ప్రేక్షకులకు స్వయంగా విజ్ఞప్తి చేసింది. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన “ఓపిక” టాస్క్‌లో అరియానా, మోనాల్ మధ్య తీవ్ర స్థాయి గొడవ జరిగింది. తన బొమ్మను పడేసినందుకు అరియానా మోనాల్‌ను నోటికొచ్చినట్లు తిట్టింది. దీంతో ఆమె గుక్క పెట్టి ఏడ్చింది. బిగ్‌బాస్ మోనాల్‌ను ఓదార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అయితే అదే సమయంలో సోహైల్ టాస్కులో పాల్గొన్నాడు. అందరు బయట సోహైల్ దగ్గర ఉండడంతో మోనాల్‌ను ఎవరు ఓదార్చలేకపోయారు. కాగా టాస్క్ ముగిశాక సోహైల్ మోనాల్ బాధను చూసి తట్టుకోలేకపోయాడు. ఆమెను అంతలా ఏడిపించనందుకు అరియానా మీద విరుచుకుపడ్డాడు. వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ ప్రోమోను నిన్నటి ఎపిసోడ్ చివరిలో చూపించారు. అరియానా, సోహైల్ ఎవరు తగ్గకుండా.. నువ్వా, నేనా అన్నట్టుగా గొడవకు దిగారు. దీంతో అరియానా కిందపడీ మరీ ఏడ్చింది. ఇంటి సభ్యులు వారిద్దరిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ఈ గొడవ ఎలా ఆగింది అనేది బుధవారం ఎపిసోడ్లో చూడాలి.