Bigg Boss 4: బెస్ట్‌ కెప్టెన్‌గా హారిక.. వరెస్ట్ కెప్టెన్‌గా అరియానా.. ఫినాలే వరకు ‘నో’ కెప్టెన్‌

| Edited By:

Nov 28, 2020 | 8:18 AM

ఇంటి సభ్యులతో బిగ్‌బాస్‌ మాట్లాడుతూ.. హౌజ్‌లో రేస్ టు ఫినాలే మొదలైందని అన్నారు. దీంతో ఫినాలే వరకు బిగ్‌బాస్‌ హౌజ్‌కి కెప్టెన్ ఉండరని తెలిపారు

Bigg Boss 4: బెస్ట్‌ కెప్టెన్‌గా హారిక.. వరెస్ట్ కెప్టెన్‌గా అరియానా.. ఫినాలే వరకు నో కెప్టెన్‌
Follow us on

Harika best captain: ఇంటి సభ్యులతో బిగ్‌బాస్‌ మాట్లాడుతూ.. హౌజ్‌లో రేస్ టు ఫినాలే మొదలైందని అన్నారు. దీంతో ఫినాలే వరకు బిగ్‌బాస్‌ హౌజ్‌కి కెప్టెన్ ఉండరని తెలిపారు. ఇక చివరి కెప్టెన్‌గా హారిక తన బ్యాండ్‌ని తీసేయాలని కోరారు. ఈ సందర్భంగా హౌజ్‌లో ఉన్న వారిలో ఎవరు బెస్ట్ కెప్టెన్..? ఎవరు వరస్ట్ కెప్టెన్..? చెప్పాలని సూచించారు. దీంతో కంటెస్టెంట్‌ల మధ్య మళ్లీ పోటీ ఏర్పడింది. నేనంటే నేను అంటూ ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఈ క్రమంలో హారిక, సొహైల్‌కి చెరో రెండు ఓట్లు పడ్డాయి. దీంతో వారిద్దరి మధ్య టై అయ్యింది. ఆ తరువాత ఇంటి సభ్యుల్లో ఎక్కువ మంది హారిక పేరు చెప్పడంతో ఆమె బెస్ట్‌ కెప్టెన్‌గా ఎన్నికైంది. మరోవైపు వరెస్ట్‌ కెప్టెన్‌గా ఎక్కువ మంది అరియానా పేరు చెప్పారు. ఈ క్రమంలో వరెస్ట్ కెప్టెన్‌గా అరియానాను అనౌన్స్ చేశారు.