Bigg Boss 4: గొడవలు, ఏడుపులు, పెడబొబ్బలు.. ఇదే ఇప్పుడు బిగ్ బాస్‌లో జరుగుతున్న లొల్లి. టాస్కులు ఇంకా ప్రారంభం కాకముందే ఇవి స్టార్ కావడంతో జనాలకు కాస్త విసుగు పుట్టిస్తోందని చెప్పాలి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ నేటి నుంచి కంటెస్టెంట్లకు ఫిజికల్ టాస్క్‌లు షూరూ చేశాడు. ఇందుకోసం 16 మంది ఇంటి సభ్యులు టీమ్స్‌గా విడిపోయారు. బిగ్ బాస్ ఇచ్చిన టమాటాలను కంటెస్టెంట్లు చేతులతోనే పిసికి జ్యూస్ చేశారు. ఎవరికి వారే తమ ప్రతాపం చూపించారని తెలుస్తోంది. అయితే గంగవ్వ మాత్రం ఈ టాస్క్‌లో పాల్గొనలేదు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా స్టార్ మా విడుదల చేసింది. మరి ఇంతకీ గంగవ్వ టాస్క్‌లో పాల్గొందా.? లేదా.? తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాలి.
ఇదిలా ఉంటే మరో ప్రోమోలో సూర్య కిరణ్, దివి మధ్య గొడవ మొదలైనట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఈ మూడు రోజులు కంటెస్టెంట్లను ఏ మేరకు పరిశీలించిందో చెప్పుకొచ్చింది. మోనాల్ గజ్జర్ ఊరికే ప్రతీదానికి ఏడుస్తుందని.. లాస్య సెన్సిటివ్ అని.. సూర్య కిరణ్.. ఎప్పుడూ తన మాటే వినాలి అనడం తగ్గిస్తే మంచిదని తెలిపింది. దీనితో సూర్య కిరణ్‌కు ఒక్కసారిగా కోపం వచ్చి వాగ్వాదానికి దిగాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందా.? లేదా.? అనేది ఈ ఎపిసోడ్‌లో చూడాలి.
First physical task ki rangam siddham with so much fun ? #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/AtZIZM8lVw
— starmaa (@StarMaa) September 10, 2020