Bigg Boss 4 Telugu: బుల్లితెర సెన్సేషన్ బిగ్‌బాస్ 4వ సీజన్‌లో ఇవాళ మొదటి ఎలిమినేషన్ ఉండనుంది. ఇప్పటికే ఎలిమినేషన్ జోన్ నుంచి అభిజిత్, సుజాత, గంగవ్వ సేవ్ అవ్వగా.. మెహబూబ్, అఖిల్, దివి, సూర్య కిరణ్ ఇంకా డేంజర్‌లో ఉన్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ వారం దర్శకుడు సూర్య కిరణ్ హౌజ్ నుంచి బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు ఒక కొత్త కంటెస్టెంట్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇక అందులో ఉన్న కంటెస్టెంట్ నటుడు సాయి కుమార్ పంపన అని తెలుస్తోంది. ఈరోజుల్లో, బస్టాప్ వంటి చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపించగా.. తాజాగా ఆ నటుడు హౌజ్‌లోకి వెళ్లబోతున్నట్లు సమాచారం. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు..? కొత్తగా హౌజ్‌లోకి రాబోతున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకుంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
Read More:
మారని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు.. రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు
పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతాం
Elimination day… Wait for the surprise!#BiggBossTelugu4 Today at 9 PM on @StarMaa pic.twitter.com/XnYgmekL4b
— starmaa (@StarMaa) September 13, 2020