పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతాం

అవకాశం వచ్చిన ప్రతిసారి పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు

పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతాం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 13, 2020 | 4:48 PM

MP Mithun Reddy News: అవకాశం వచ్చిన ప్రతిసారి పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో కరోనా నియంత్రణ చర్యలు, భారత్‌-చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలను చర్చించాలని స్పీకర్ కోరినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై కూడా చర్చించాలని తాము కోరినట్లు పేర్కొన్నారు.

ఇక మరోవైపు టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్షనేత నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లేవనెత్తుతామని అన్నారు. ఈ సమావేశాల్లో 11 ఆర్డినెన్స్‌లను కేంద్రం ప్రవేశ పెట్టబోతోందని.. మొత్తం 25 బిల్లులు ఉన్నాయని తెలిపారు. నూతన విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

Read More:

రాకాసి దోమల దాడి.. వందల సంఖ్యలో చనిపోయిన మూగ జీవాలు

జర్మనీ నుంచి పంది మాంసం దిగుమతిని ఆపేసిన చైనా