Bigg Boss 4 Telugu: ఈ వారం లగ్జరీ టాస్క్‌లో భాగంగా ఉక్కు హృదయం అనే టాస్క్‌ని బిగ్‌బాస్ సభ్యులకు ఇచ్చిన విషయం తెలిసిందే. రోబో- మనుషులుగా సభ్యులను విడిపోయి కొన్ని ఖండిషన్లు పెట్టి బుధవారం ఈ ఆటను ఆడించాడు బిగ్‌బాస్. అయితే ఈ టాస్క్‌లో చాలా రచ్చ రచ్చలే జరిగాయి. బుధవారం ఎపిసోడ్‌లో మనుషులు కెమెరాలకు దిండ్లు అడ్డు పెట్టి బయటనే పని కానిచ్చేశారు. దీనిపై బిగ్‌బాస్ ఫైర్ అయ్యారు. ఇక ఆ రోజే దివిని మనుషుల టీం కిడ్నాప్ చేయడంతో కొట్లాట వరకు వెళ్లి, హౌజ్‌లో దూషణల పర్వంతో పాటు బూతుల వర్షం కురిసింది.
ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లోనూ అదే హీట్ కొనసాగింది. అమ్మాయిల మీద పడి దొర్లి మరీ కొట్టుకున్నారు. ఇక రోబోలలో అరియానా, కుమార్ సాయి, అవినాష్, లాస్యలు చనిపోయినట్లుగా తెలిపిన బిగ్‌బాస్.. బుధవారం నాడే చనిపోయిన దేవి గురించి చెప్పలేదు. అంతేకాదు రాజశేఖర్ మాస్టర్ దగ్గర చార్జింగ్ తీసుకున్న అవినాష్‌ని మాత్రం చనిపోయినట్లుగా బిగ్‌బాస్ ప్రకటించారు. దీంతో ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేశారు బిగ్‌బాస్. మొత్తానికి ప్రోమోల్లో కనిపించినంత పస.. ఆటలో లేకుండా పూర్తి కానిచ్చేశారు బిగ్‌బాస్.
Read More:
Bigg Boss 4: మోనాల్‌కి దూరంగా.. హారికకు దగ్గరగా.. హౌజ్‌లో మరో లవ్‌స్టోరీ
బాలు హెల్త్ అప్డేట్ : ఏ నిమిషాన ఏమి వినాల్సి వస్తుందోనన్న ఆందోళన