Bigg Boss 4: అభి కోసం కెప్టెన్‌వి అయ్యావు.. తప్పుల చిట్టా చెప్పిన నాగార్జున.. ఒప్పుకున్న హారిక

| Edited By:

Nov 29, 2020 | 7:44 AM

శనివారం నాటి ఎపిసోడ్‌లో ఎప్పటిలాగే తన ఫైర్‌ని చూపించారు నాగార్జున. చివరి కెప్టెన్‌ హారికను కన్ఫెషన్‌ రూమ్‌లోకి రమ్మని చెప్పి.. ఆమెతో మాట్లాడారు

Bigg Boss 4: అభి కోసం కెప్టెన్‌వి అయ్యావు.. తప్పుల చిట్టా చెప్పిన నాగార్జున.. ఒప్పుకున్న హారిక
Follow us on

Nagarjuna class Harika: శనివారం నాటి ఎపిసోడ్‌లో ఎప్పటిలాగే తన ఫైర్‌ని చూపించారు నాగార్జున. చివరి కెప్టెన్‌ హారికను కన్ఫెషన్‌ రూమ్‌లోకి రమ్మని చెప్పి.. ఆమెతో మాట్లాడారు. బెస్ట్ కెప్టెన్‌గా ఎంపికైనందుకు అభినందనలు చెప్పి.. ఈ వారం చేసిన మంచి పనుల గురించి హారికను చెప్పమన్నారు. తన దృష్టిలో అనౌన్స్‌మెంట్‌లు, పనిష్మెంట్‌లు సెకండరీ ఫ్యాక్టర్ అని.. ఇంటి సభ్యులు రూల్స్ సక్రమంగా పాటిస్తున్నారా..? లేదా..? చూసుకోవడం మొదటగా భావించానని హారిక చెప్పుకొచ్చింది. తాను అంతా బాగానే చేశానని అనుకుంటున్నానని హారిక అభిప్రాయపడింది.

ఆమె చెప్పిందంతా విన్నా నాగార్జున.. హారిక తప్పుల చిట్టాను చూపించడం మొదలుపెట్టారు. మొదటగా మోనాల్ బిజినెస్ అంటూ అభి ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే.. తెలుగులో మాట్లాడాలని చెప్పలేదని, అంతేకాకుండా హారిక కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడిన వీడియోను నాగార్జున చూపించారు. అలాగే ఒక కెప్టెన్‌గా అభిజిత్‌ టాస్క్‌ చేసేలా ప్రోత్సహించలేదని అన్నారు. అయితే ఆభి ఆ టాస్క్‌ని పర్సనల్‌గా తీసుకున్నాడని.. ‘అభిజీత్, అఖిల్ మోనాల్‌ను ఏడిపించారు’ అని బిగ్‌బాస్‌ పేర్కొనడం తప్పుగా అనిపిస్తోందని, తానెప్పుడూ మోనాల్‌ను ఏడిపించలేదని అభిజిత్‌ తనకు చెప్పాడని చెప్పింది.

అది నువ్వు నమ్ముతున్నావా..? అని నాగార్జున అడగ్గా.. అఖిల్‌, అభి కావాలని మోనాల్‌ని ఏడిపించలేదు సర్‌. అక్కడున్న పరిస్థితులను బట్టి ఆమె ఏడ్చింది అంటే అని వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా మోనాల్‌ని తాను ఏడిపిస్తున్నానని ఆమె తల్లి వచ్చి తనను అడిగితే వెళ్లి దాక్కుంటానని అభి.. లాస్య, మోనాల్‌, హారికల ముందు అన్న మాటలను వీడియో క్లిప్ ద్వారా నాగార్జున హారికకు చూపించారు. అభి తన నోటి నుంచి అన్న మాటనే బిగ్‌బాస్ అడిగారని.. దాన్ని అభి పర్సనల్‌గా తీసుకొని నాకు ఇది నచ్చలేదు, ఇది మోనల్ బిజినెస్ అంటూ టాస్క్ చేయకపోవడం ఏంటని నాగ్‌ ప్రశ్నించారు. ఒక కెప్టెన్‌గా అభిజిత్ పట్ల విపరీతమైన ఫేవరిజం చూపించావని మండిపడ్డారు. మరోవైపు అఖిల్ కోసం తాను స్వైప్ అవుతానని సొహైల్ చెప్పినా.. నువ్వు పట్టించుకోలేదు. నీకు సాయం చేసిన మోనాల్‌ని పక్కనపెట్టి అభిని స్వైప్ చేశావు అని నాగార్జున నిలదీశారు. దీంతో తన తప్పులను హారిక ఒప్పుకుంది.