Bigg Boss 4 Avinash: బిగ్‌బాస్ 4 శుక్రవారం నాటి ఎపిసోడ్ ఎమోషనల్‌గా నడిచింది. ఒక్కొక్కరు తాము పడ్డ ఇబ్బందులను చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో కమెడియన్ అవినాష్ మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బాంబు పేల్చాడు. లైఫ్‌లో నేను రెండే నమ్ముతా. ఒకటి తల్లిదండ్రులు.. రెండు ప్రేక్షకులు. నేను ఫ్రెండ్స్‌ని కూడా ఫ్యామిలీలా కౌంట్ చేస్తా. నాకు ఇప్పుడు 30 ఏళ్లు. నేను ఇప్పటికే ఒక ఇళ్లు కొనుక్కున్నా. కారు కొనుక్కున్నా. దానికి ముఖ్య కారణం ప్రేక్షకులు. నా తల్లిదండ్రులు, ప్రేక్షకులు లేకపోతే.. ఈ ముక్కు అవినాష్ మీ ముందు ఉండేవాడు కాదు. నన్ను ఒక స్థాయికి తీసుకువచ్చారు. నన్ను అభిమానిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు.
ఆ తరువాత.. ”ఇటీవల లాక్‌డౌన్‌లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఈ లాక్ డౌన్ ఎవరికైనా కష్టం వస్తే ఆర్టిస్ట్ రెస్పాండ్ అవ్వాలి. మన దగ్గర డబ్బులు లేకపోయినా మనల్ని అభిమానించే వాళ్లకి సాయం చేయాలి. ఎందుకంటే వాళ్ల వలనే మనం ఇలా ఉన్నాం కాబట్టి. వాళ్లకి కష్టం వస్తే హెల్ప్ చేయాలి. కానీ ఈ మధ్యేనే కొత్తగా ఇల్లు కొన్నా. దాని ఈఎంఐ నెలకు రూ.45 వేలు. అది కట్టలేని పరిస్థితిలోకి వెళ్లిపోయా. చాలా మంది అనుకోవచ్చు. ఈఎంఐ కట్టలేనప్పుడు ఇళ్లు ఎందుకు కొన్నావు అని..? కానీ కట్టగలను అనే నమ్మకంతో దాన్ని కొన్నాను. అదే టైంలో నాన్నకి హార్ట్ స్టోక్ వచ్చి స్టంట్లు పడ్డాయి. అందుకు రూ. 4 లక్షలు ఖర్చు అయ్యింది. ఆ డబ్బు నేను ఇల్లు కోసం దాచింది. అప్పటికే ఇల్లుకి అడ్వాన్స్ కూడా ఇచ్చేశా. అదే టైంలో అమ్మకి మోకాళ్లు అరిగిపోయాయి. దానికి కూడా డబ్బు అయ్యింది. మేం ఐదు మంది అన్నదమ్ములమైనా, వాళ్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అందుకే నేను ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక ఇల్లు కూడా తీసుకోవడంతో బయట నుంచి రూ.13లక్షలు అప్పు చేశా. నేను అప్పులు చేసింది నా తల్లిదండ్రుల కోసం. వాళ్లు బావుండాలి అనుకున్నా. వాళ్లు బతికి ఉన్నప్పుడే చూసుకోవాలి. ఉన్నప్పుడే కాపాడుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించండి” అని అవినాష్ చెప్పుకొచ్చాడు. అయితే లాక్‌డౌన్ సమయంలో తన ఈఎంఐ కట్టుకోలేక సూసైడ్ చేసుకోవానుకున్నాడో లేక ఎవ్వరికీ సాయం చేయలేనందుకు ఆ పనిచేసుకోవాలనుకున్నాడో తెలీదు గానీ.. కష్టాలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవడం అన్నది ఎప్పటికీ పరిష్కారం కాదు.
Read More: