Bigg Boss 4 Telugu: గత కొన్ని రోజులుగా మోనాల్‌కి దూరంగా ఉంటూ వస్తోన్న అభిజిత్.. ఆ విషయంపై గట్టి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదో అవసరం ఉంటే తప్ప ఆమె గురించి పట్టించుకోవడం, మాట్లాడటం చేయడం లేదు అభి. ఇదిలా ఉంటే సోమవారం నాటి ఎపిసోడ్‌లో మోనాల్ విషయంలో అభిని ఉడికించాలని లాస్య చూసింది.
నోయల్, అభి, లాస్య, హారికలు గ్రూప్ డిస్కషన్ పెట్టగా.. మోనాల్ గురించి మాట్లాడింది లాస్య. మోనాల్ అందరి బెడ్ షీట్లు మడత పెట్టి.. నీ బెడ్ షీట్ మడతపెట్టలేదంటే చూడు నువ్వంటే ఎంత స్పెషలో అని అభికి చెప్పింది. ఆమెతో పాటు నోయల్ కూడా జతకలిశాడు. అయితే వెంటనే స్పందించిన అభి.. ఆమె మడత పెట్టినా నేను విప్పేసుకుంటా. ఆ విషయంలో నాకు ఫుల్ క్లారిటీ ఉందని అన్నాడు. నేనేమీ తనను హేట్ చేయలేదని తెలిపాడు. కానీ చీటెడ్ అంటూ మోనాల్‌ని అసహ్యించుకున్నాడు.
Read More:
Bigg Boss 4: మా ముగ్గురి టాపిక్ తేవొద్దు.. కుళాయి విప్పేసిన మోనాల్
Bigg Boss 4: ఎనిమిదో వారం ఎలిమినేషన్.. నామినేట్ అయిన ఆరుగురు