ఎవర్ గ్రీన్ మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా.. గత ఆదివారం మొదలైన సంచలన బిగ్ బాస్ రియాలిటీ షో ఐదు ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని ఆరో ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. రేపు శనివారం నాగ్ హౌజ్‌లో మెస్మరైజ్ చేయనున్నారు. ఇక ఈవారం ఎలిమినేషన్‌లో రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఉండటంతో..ఎవరూ ఎల్మినేట్ అవుతారా అన్న ఆసక్తి నెలకుంది. ఫస్ట్ వీకెండ్ కాబట్టి ఎలిమినేషన్ లేకపోయినా ఆశ్యర్యం లేదు.
ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ :
ఎపిసోడ్ ప్రారంభంలో కూడా వరుణ్ తేజ్- మహేష్ విట్టాల వార్ నేపథ్యంలోనే సాగింది. తాను వితికాను ఒక చెల్లెలుగా భావించే.. పో.. అన్నానని.. మరో ఉద్దేశం లేదని హౌస్ మేట్స్ ముందు తన వెర్షన్ చెప్పుకున్నాడు మహేష్ విట్టా. కానీ వరుణ్,వితికా జంట శాంతించలేదు. శ్రీముఖి కూడా వారికే సపోర్ట్ చేసింది. దీంతో మహేశ్ విట్టా.. తనది రాయలసీమ అవ్వడం వల్ల స్లాంగ్ అలా ఉంటుందని..తన అయ్యి ఉంటే.. తప్పు ఉన్నా లేకపోయినా సారీ చెప్తా అని చెప్పగా.. తనకు స్ట్రయిట్‌గా సారీ చెప్పాలంటూ వితికా శేరూ మళ్లీ రచ్చ షురూ చేసింది.
మళ్లీ మహేశ్ కాస్త ఆవేశంతో మాట్లాడటంతో..వరుణ్ సందేశ్ రెచ్చిపోయాడు. నన్ను బ్రో అనకు.. వరుణ్ అను అంటూ కాస్త యాట్యుట్యూడ్ చూపించాడు. తీవ్ర వాగ్వివాదం తర్వాత మహేశ్ విట్టా సారీ చెప్పాడు.