బిగ్‌బాస్‌లో ఆమె వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కన్ఫామ్..?

| Edited By:

Sep 02, 2019 | 6:40 PM

‘బిగ్‌బాస్‌ 3’షో ప్రస్తుతం.. హయ్యెస్ట్ రేటింగ్‌తో దూసుకెళ్తుంది. పలు వివాదాలు.. ఇంటి సభ్యుల రచ్చ మధ్య బిగ్‌బాస్ 3 ఆడియన్స్‌ని తెగ అలరిస్తోంది. నెక్ట్స్‌ ఏం జరుగుతుందా..? ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో.. అని ఎదురుచూస్తున్నారు. కాగా.. ఇప్పుడు ప్రేక్షకుల ఆసక్తి అంతా.. రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరా..? అనేది. మొదటి వైల్డ్‌కార్డ్ ఎంట్రీలో ట్రాన్స్‌జెండర్ తమన్నా ఎంట్రీ ఇచ్చి.. మూడోవారంలోనే ఎలిమినేషన్ అయ్యింది. కాగా.. ఇప్పటివరకూ బిగ్‌బాస్ 3లో.. ఆరు వారాల్లో.. 5 ఎలిమినేషన్స్ […]

బిగ్‌బాస్‌లో ఆమె వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కన్ఫామ్..?
Follow us on

‘బిగ్‌బాస్‌ 3’షో ప్రస్తుతం.. హయ్యెస్ట్ రేటింగ్‌తో దూసుకెళ్తుంది. పలు వివాదాలు.. ఇంటి సభ్యుల రచ్చ మధ్య బిగ్‌బాస్ 3 ఆడియన్స్‌ని తెగ అలరిస్తోంది. నెక్ట్స్‌ ఏం జరుగుతుందా..? ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో.. అని ఎదురుచూస్తున్నారు. కాగా.. ఇప్పుడు ప్రేక్షకుల ఆసక్తి అంతా.. రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరా..? అనేది. మొదటి వైల్డ్‌కార్డ్ ఎంట్రీలో ట్రాన్స్‌జెండర్ తమన్నా ఎంట్రీ ఇచ్చి.. మూడోవారంలోనే ఎలిమినేషన్ అయ్యింది. కాగా.. ఇప్పటివరకూ బిగ్‌బాస్ 3లో.. ఆరు వారాల్లో.. 5 ఎలిమినేషన్స్ జరిగాయి. ఆరోవారంలో జరగాల్సిన ఎలిమినేషన్‌ను.. కింగ్ నాగ్ బర్త్ డే సందర్భంగా.. వాయిదా వేశారని తెలుస్తోంది.

కాగా.. రెండో సారి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలో శ్రద్ధాదాస్, ఈషారెబ్బా పేర్లు బాగా వినిపించాయి. అయితే.. ఇప్పుడు తెరపైకి మరో పేరు వచ్చింది. ఆమె కూడా యాంకర్‌నే. పెద్ద మాటకారి కూడా.. ఒకప్పుడు మంచి మంచి షోలకు అదిరిపోయేలా యాంకరింగ్ చేసింది. ఎవరా అని ఆలోచిస్తున్నారా..? ఇంకెవరు శిల్పా చక్రవర్తి. ప్రస్తుతం ఆమెనే ఈ సారి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇస్తారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంటిలో.. ప్రస్తుతం ఇంటిసభ్యుల్లో బాబా మాస్టర్‌నే పెద్దగా వ్యవహరిస్తున్నారు. పెద్ద యాక్టర్‌గా ఉన్న నటి హేమ మొదటివారంలోనే ఎలిమినేషన్‌ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆ స్థానంలోకి శిల్పా చక్రవర్తి ఉంటుందా..? లేదా అనేది.. మరి కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.

అయితే.. ఇదివరకు రెండో సీజన్‌లో నూతన నాయుడు, శ్యామల ఎంట్రీ ఇచ్చారు. మరి ఈసారి కూడా పాత కంటెస్టెంట్స్‌నే ఎంట్రీ ఇస్తారా..? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారో.. చూడాలి.