నటుడి వింత ప్రవర్తన.. మరోసారి చితక్కొట్టిన స్థానికులు!

|

Sep 03, 2019 | 2:08 AM

కన్నడ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ హుచ్చ వెంకట్ మరోసారి వార్తల్లో నిలిచాడు. రెండు రోజుల క్రితం కొడగులో స్థానికులపై తన అసహనాన్ని వ్యక్తం చేసి కారు అద్దాలను వెంకట్ ధ్వంసం చేశాడు. దీనితో అక్కడ ఉన్న స్థానిక యువత అతడిని చితక్కొట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మాండ్య నగరానికి వచ్చి ఒక హోటల్లో దిగిన హుచ్చ వెంకట్‌ ఆదివారం ఉదయం మరోసారి వింతగా ప్రవర్తించాడు. హోటల్ ముందు నిలిపి ఉన్న గుర్తు తెలియని […]

నటుడి వింత ప్రవర్తన.. మరోసారి చితక్కొట్టిన స్థానికులు!
Follow us on

కన్నడ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ హుచ్చ వెంకట్ మరోసారి వార్తల్లో నిలిచాడు. రెండు రోజుల క్రితం కొడగులో స్థానికులపై తన అసహనాన్ని వ్యక్తం చేసి కారు అద్దాలను వెంకట్ ధ్వంసం చేశాడు. దీనితో అక్కడ ఉన్న స్థానిక యువత అతడిని చితక్కొట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మాండ్య నగరానికి వచ్చి ఒక హోటల్లో దిగిన హుచ్చ వెంకట్‌ ఆదివారం ఉదయం మరోసారి వింతగా ప్రవర్తించాడు. హోటల్ ముందు నిలిపి ఉన్న గుర్తు తెలియని కారు అద్దాలను పగలకొట్టాడు. దానితో ఆ కారు యజమాని హుచ్చ వెంకట్ మీద దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంకట్‌ను సీన్ నుంచి తీసుకుని వెళ్లారు. ఇక కొడుగులో హుచ్చ వెంకట్‌ను చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

కాగా నటుడిగా గుర్తింపు పొందిన హుచ్చ వెంకట్ గతంలో కూడా పలుమార్లు ఇలాగే ప్రవర్తించాడు. తాగిన మైకంలో ఓ బేకరీ దగ్గరకు వెళ్లి అక్కడున్న వారిని కాళ్లతో తన్ని అలజడి సృష్టించగా.. బేకరీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుచ్చను హెచ్చరించి పంపించారు. అంతేకాకుండా దివ్య స్పందన అనే నటిని పెళ్లి పేరుతో వేధించినందుకు అతనిపై కేసు కూడా నమోదైంది. అటు ఓ లైవ్ డిబేట్‌లో డైరెక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు.