Big News Big Debate: కంటెంట్ ఉన్న లోకల్ సినిమాలు దేశవ్యాప్తంగా రాణించినట్టు.. కంటెంట్ ఉన్న పార్టీ ఎందుకు రాణించకూడదు  : కేటీఆర్..

Big News Big Debate: కంటెంట్ ఉన్న లోకల్ సినిమాలు దేశవ్యాప్తంగా రాణించినట్టు.. కంటెంట్ ఉన్న పార్టీ ఎందుకు రాణించకూడదు : కేటీఆర్..

Shiva Prajapati

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 30, 2022 | 8:30 PM

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు ఎన్నిక అంటూ ఎవరికి వారు ప్రచారం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలను తలపిస్తున్న ఎన్నికల్లో ప్రధానపార్టీలు ..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు ఎన్నిక అంటూ ఎవరికి వారు ప్రచారం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలను తలపిస్తున్న ఎన్నికల్లో ప్రధానపార్టీలు బలగాలను మోహరించి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌ అయితే ఏకంగా మంత్రులకు గ్రామాలను అప్పగించింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ఒవరాల్‌గా పర్యవేక్షణ చేస్తూనే… గట్టుప్పల్‌ మండలంలో మెజార్టీ తీసుకొచ్చే బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. లైఫ్‌ అండ్‌ డెత్‌గా మారిన ఈ ఎన్నికల్లో గెలిస్తే ఓ లెక్క… ఓడిపోతే మరో లెక్క అన్నట్టుగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజల్లో ఈ ఎన్నికలపై ఎన్నడూ లేనంతగా చర్చ జరుగుతోంది.. మరి నిజంగానే ఈ ఎన్నికలు పార్టీల జాతకాలను.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను తలకిందులు చేస్తాయా? మునుగోడు మాత్రమే కాదు..ఇటీవల కాలంలో మారుతున్న రాజకీయ పరిణామాలు.. చోటు చేసుకుంటున్న ఘటనలపై టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావుతో టీవీ9 మేనేజింగ్ డైరెక్టర్ రజనీకాంత్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో కింద చూడండి..



Published on: Oct 29, 2022 06:52 PM