క్రిమినల్ చట్టాల్లో పదును లేదా? పోలీస్ యంత్రాంగం విఫలమవుతోందా?
మహిళలపై అకృత్యాలకు బాధ్యత ఎవరిది?
NCRB డేటా చెబుతున్న వాస్తవాలేంటి?
Big News Big Debate: దేశంలో అడుగుకో కామాంధుడు ఉన్నాడు. గంటకో అత్యాచారం జరుగుతూనే ఉంది. వయసు, వరస మరిచి మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. మరి వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఉన్న చట్టాలు చాలవని కఠిన చట్టాలు తెచ్చారు. అయినా ఎందుకు ఆగడం లేదు. జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ మహిళల భద్రతకు తీసుకున్న చర్యలు.. ఏర్పాటు అయిన కమిషన్లు కూడా ఎందుకు అరికట్ట లేకపోతున్నాయి… ఏం చేస్తే ఆగుతాయి.. ఎలాంటి చర్యలు తీసుకుంటే మహిళలు స్వేచ్ఛగా తిరుగుతారు.
మరో రెండు నెలల్లో డిసెంబర్ వస్తోంది. అంటే నిర్భయ ఘటనకు 10 ఏళ్లు. అయనా అలాంటి ఘటనలకు పుల్ స్టాప్ పడలేదు. ఇంకా ఎంతో మంది నిర్భయలు బలౌతూనే ఉన్నారు. నిన్నటికి నిన్న ముంబైలో ఓ యువతిని కారులోనే అత్యాచారం చేసి హింసించి చంపేశారు. ఈ ఘటన గురించి చర్చ ముగియకముందే హైదరాబాద్ నడిబోడ్డున సింగరేణి కాలనీలో జరిగిన ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.
2012లో అత్యాచారా కేసులు 24వేల 923 అయితే… తాజాగా NCRB విడుదల చేసిన నివేదిక ప్రకారం 43వేల దాటాయి. అంటే ఈ మధ్య కాలంలో దాదాపు డబుల్ అయ్యాయి. పాత చట్టాలు మహిళలకు భద్రత కల్పించడం లేదని.. తెచ్చిన నిర్భయ చట్టాలు ఎందుకు కట్టడి చేయలేకపోయాయి.
నిర్భయ చట్టానికి మందు తర్వాత
2012 – 24,923
2019 – 32033
2020 – 28,046( కరోనా కారణంగా తగ్గాయి)
2013లో కేంద్ర ప్రభుత్వం లైంగిక అత్యాచారానికి గురైన మహిళల సంరక్షణ, పునరావాసం కోసం నిర్భయ నిధిని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నాలుగేళ్లలో దానికి మరో 3వేల కోట్లను జత చేశారు. కానీ ఎంత ఖర్చు చేశారన్నది ఇప్పటికీ లెక్కలు లేవు. దిశ కేసు తర్వాత మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అటు జాతీయ మహిళా కమిషన్‌కు కూడా వస్తున్న ఫిర్యాదులు వేల సంఖ్యలో ఉంటున్నాయి. పోలీసులు కేసులు పెట్టినా న్యాయం జరగలేదని ఎంతోమంది మహిళలు విమెన్ కమిషన్లను ఆశ్రయిస్తున్నారు.
గత ఏడాది అంటే 2020లో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్‌కు అందిన ఫిర్యాదులు మొత్తం 23వేల 722
ప్రాణహాని 7715
గృహహింస 5297
వరకట్న వేధింపులు 3788
అసభ్య ప్రవర్తన 1679
పోలీసులు బాధ్యతారాహిత్యం 1276
సైబక్ క్రైమ్ 704
వరకట్న హత్యలు 330
లైంగిక వేధింపులు 376
అత్యాచారాలే కాదు… అసలు మహిళల జీవించే హక్కే ప్రశ్నార్ధకం అవుతోంది. గృహహింస, వరకట్న చావులు, ఆడపిల్ల పేరుతో భ్రూణ హత్యలు ఇలా నిరంతరం వారిపై జరుగుతున్న దాడి ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా నానాటికీ పెరుగుతున్న నేరాలు భయపెడుతున్నాయి. మహిళల భద్రతను పరిస్థితులు ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఇవే అంశాలపై టీవీ9 స్టూడియోలో బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ చర్చ చేపట్టింది… వివరాలు చూద్దాం..