Big News Big Debate: శాంతి చర్చలు అంటూనే అణుబాంబులు సిద్ధం చేయాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కి పడేలా చేసింది. రష్యా ప్రకటనపై భగ్గుమన్న నాటో దేశాలు కూడా అణ్వాస్త్రాలతో అలర్ట్ అవుతున్నాయి. దేనికైనా సై అంటున్నాయి పశ్చియ దేశాలు. తాజా ఉద్రిక్తతలతో చరిత్రలో కనీవిని ఎరుగని నాగసాకి, హిరోషిమా విషాదాలు మరోసారి కళ్లముందు కదలాడాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు రెండు దేశాలూ చర్చలకు అంగీకరించి, ప్రక్రియ మొదలు అయినా అణ్వాయుధ బలగాలను హై అలెర్ట్‌లో ఉంచాలంటూ ఆర్మీ చీఫ్‌లను ఆదేశించారు పుతిన్. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో బయటి నుంచి జోక్యం చేసుకోవాలని ఎవరైనా భావిస్తే చరిత్ర రిపీట్ అవుతుందని, పర్యవసానాలు సీరియస్‌గా ఉంటాయని నాటో దేశాలకు ముందే వార్నింగ్ ఇచ్చారు పుతిన్. లేటెస్టుగా నాటో దళాలు రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నాయని అనుమానించిన పుతిన్.. అణ్వాయుధ బలగాలను అప్రమత్తంగా ఉంచాలని ఆదివారం ఆర్మీ అధికారులను ఆదేశించారు.
ఇక పుతిన్ ప్రకటన ప్రమాదకరమంటున్న నాటో దేశాలు అలర్ట్ అయ్యాయి. అమెరికా కూడా న్యూక్లియర్ స్ట్రేటజీ మీటింగ్‌తో వేడి మరింత రాజేసింది. అటు యూరోప్ దేశాలు కూడా బలగాలను రెడీ చేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై విరుచుకపడుతున్న రష్యాపై అమెరికా సహా అగ్రదేశాలు సైనిక చర్యలకు దిగకపోయినా ఆర్ధికంగా అష్టదిగ్భంధనం చేస్తున్నాయి. ట్రేడ్ వార్ ప్రకటించాయి. ఉక్రెయిన్‌కు ఆర్థికసాయం ప్రకటిస్తున్నాయి. దీంతో నాటో దేశాలపై నమ్మకం లేదంటున్న పుతిన్.. అణుబాంబులను సిద్దం చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ పై వాడటానికి ఉపయోగించరాదని, ఒకవేళ ఆ దేశానికి మద్దతుగా నాటో దళాలుగానీ, మరే ఇతర దేశమైనా ఎంటరైతేనే తీవ్ర పరిణామాలు తప్పవని రష్యా చెబుతోంది. ఏదేమైనా శాంతి చర్చల వేళ పుతిన్ అణు బాంబుల ప్రకటన పశ్చిమదేశాలకు హెచ్చరికలాంటిదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1945 తర్వాత ఏ దేశమూ అణ్వాయుధాలు ఉపయోగించలేదు. తాజాగా పుతిన్ మాటలు అణు యుద్ధం హెచ్చరిక లాగే కనిపిస్తున్నాయి.
– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్
ఈ అంశంపైనే టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..
Also read:
Volodymyr Zelenskyy: సోషల్ మీడియా శక్తిని అందిపుచ్చుకుంటున్న యోధుడు.. యుద్ధకాల నాయకుడు జెలెన్‌స్కీ
సినిమాను తలపించేలా జీవితం.. ఆఫ్ఘన్‌ను వదిలి ఉక్రెయిన్‌కు.. ఇప్పుడు అక్కడి నుంచి పోలాండ్‌కు
కొమురవెల్లి ఆలయంలో చోరీకి విఫలయత్నం.. పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు.. ట్విస్ట్ ఏంటంటే