Big News Big Debate: పార్లమెంట్‌ సాక్షిగా తెరపైకి మానిన గాయం.. ప్రధాని వ్యాఖ్యలపై TRS అభ్యంతరం ఏంటి?

|

Feb 09, 2022 | 10:03 PM

Big News Big Debate: మాటలు రేపిన చిచ్చు తెలంగాణ రాజకీయాల్లో రావణకాష్టంలా మండుతోంది. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ అనుమానం వ్యక్తం చేసింది టీఆర్ఎస్‌.

Big News Big Debate: పార్లమెంట్‌ సాక్షిగా తెరపైకి మానిన గాయం.. ప్రధాని వ్యాఖ్యలపై TRS అభ్యంతరం ఏంటి?
Big News Big Debate
Follow us on

Big News Big Debate: మాటలు రేపిన చిచ్చు తెలంగాణ రాజకీయాల్లో రావణకాష్టంలా మండుతోంది. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ అనుమానం వ్యక్తం చేసింది టీఆర్ఎస్‌. అటు గుజరాత్‌ను కంటే తెలంగాణలో వేగంగా జరుగుతున్న డెవలప్‌మెంట్‌ మోదీకి నచ్చడం లేదంటున్నారు కేటీఆర్‌. తెలంగాణ పట్ల కక్షకు ప్రధాని వ్యాఖ్యలు నిదర్శమని గులాబీదళం ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలను బయటపడితే TRS ఎందుకు ఉలిక్కిపడుతుందని ప్రశ్నిస్తున్నారు కమలనాథులు. అటు TRS‌-BJPలది డ్రామా అని.. అందుకే మోదీ వ్యాఖ్యలపై KCR‌ స్పందించలేదంటోంది కాంగ్రెస్‌.

నిరసనలతో మార్మోగిన తెలంగాణ.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఊరూ-వాడా వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలు
జనగాంలో టీఆర్ఎస్‌-బీజేపీ మధ్య స్ట్రీట్‌ ఫైటింగ్‌
యస్‌.. తెలంగాణ వ్యాప్తంగా అగ్గి రాజుకుంది. పార్లమెంట్ వేదికగా విభజనపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై గులాబీ శ్రేణులు భగభగ మండిపోతున్నాయి. కేడర్‌ టు లీడర్‌ రోడ్డుపైకి రావడంతో BJP వ్యతిరేక నినాదాలతో రాష్ట్రమంతా దద్దరిల్లింది. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ర్యాలీలు చేపట్టారు TRS కార్యకర్తలు. పలు జిల్లాల్లో పోటాపోటీ ర్యాలీలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ట్విట్టర్లోనూ ModiEnemyOfTelangana పేరుతో హ్యాష్‌టాగ్‌ ట్రెండింగ్‌ చేస్తున్నారు.

ఏడేళ్లలో తెలంగాణకు మోదీ ఏం చేశారని… ప్రధాని వ్యాఖ్యలతో కేంద్రానికి తెలంగాణపై బీజేపీకి ఉన్న ప్రేమేంటో అర్థం అవుతుందన్నారు మంత్రులు.
అటు మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ కూడా యాక్షనలోకి దిగింది. తెలంగాణ జాతి మొత్తానికి ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాల్సిందే అంటోంది. రాజకీయ స్వార్థంతో సెంటిమెంట్‌ రెచ్చగొట్టడానికి టీఆర్ఎస్‌-బీజేపీ ఆడుతున్న నాటకమని అనుమానం వ్యక్తం చేస్తోంది హస్తం పార్టీ. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాణేనికి చెరోవైపు అన్న విషయం మరోసారి తేలిపోయిందన్నారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్ అసమర్థ విధానాలను ప్రధాని ప్రస్తావిస్తే తెలంగాణను అవమానించినట్లా అని ప్రశ్నిస్తోంది బీజేపీ.

డివిజన్ లేకుండానే విభజన బిల్లును ఆమోదించారంటున్నారన్న ప్రధాని నాడు బీజేపీ మద్దతు ఇచ్చిన అంశాన్ని మరిచిపోయారా అంటూ నిలదీశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. చిన్నమ్మ లేకుండానే, పెద్దమ్మ తెలంగాణను ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు.
వరి యుద్ధం నుంచి ప్రధాని టూరు దాకా ప్రతిఅంశంలో మాటలమంటలు పడుతున్న సమయంలో ఒక్కసారిగా ఎగిసిపడిన తెలంగాణ సెంటిమెంట్‌ అగ్గి ఎక్కడకు దారి తీస్తుందో.?

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.