Big News Big Debate: ఊరూ – వాడా పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. తెలుగుదేశం 40 ఏళ్ల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ జన్మదినం రోజు కావడంతో కేడర్ ఉత్సాహంతో ఉరకలేస్తోంది. NTR చరిత్రను తిరగరాస్తే… ఆ తర్వాత పార్టీని చంద్రబాబు నిలబెట్టి నడిపించారు. నాలుగు దశాబ్ధాల చరిత్రను గుర్తుచేసుకుని.. భవిష్యత్తుకు భరోసా కల్పించే ప్రయత్నంలో ఉంది పార్టీ.
పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1982 మార్చి 29న నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఈ నాలుగు దశాబ్ధాల్లో పార్టీ తెలుగు ప్రజల జీవితాల్లో మమేకమైంది. భవిష్యత్తు తరాలకు కూడా ఎన్టీయార్ ఆశయాలు అందించడానికి క్యాడరంతా మరోసారి పునరంకితం కావాలంటూ పిలుపునిస్తోంది నాయకత్వం. 40 ఏళ్ల సంబరాల్లో గత వైభవాన్ని గుర్తుచేస్తూనే, రాష్ట్రానికి పార్టీ అవసరాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం. NTR చరిష్మాను ఈ తరానికి పరిచయం చేసేలా కార్యక్రమాలు రూపొందించింది. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఊరూ వాడలు నందమూరి నామస్మరణతో మార్మోగుతున్నాయి.
ఎన్డీయార్ పేరు వాడుకునే నైతిక హక్కు TDPకి లేదంటోంది అధికార వైసీపీ. వెన్నుపోటు ద్వారా అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు NTR పేరు వాడుకుని రాజకీయం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. 1982లో NTR పెట్టిన తెలుగుదేశం వేరు… చంద్రబాబు నాయకత్వంలోని TDP వేరంటోంది వైసీపీ.
అధికారంలోకి వస్తూనే అధికార ఫలాలు అన్ని వర్గాలకు పంచింది తెలుగుదేశం. బలహీన వర్గాల్లో రాజకీయచైతన్యం నింపింది. సంక్షేమంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. అలాంటి పార్టీ ప్రస్తుతం సవాళ్లతో సహవాసం చేస్తోంది. వైసీపీ నుంచి గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రతిఘటన వస్తోంది. అయితే తట్టుకుని పూర్వ వైభవాన్ని సంపాదించడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రస్తుతానికి చంద్రబాబు నాయకత్వం బలంగా కనిపిస్తున్నా… భవిష్యత్తుపై భయాలు కొనసాగుతున్నాయి.
– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్
ఈ అంశంపైనే టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..
Also read:
PM Modi – CM Kcr: ప్రధాన మంత్రికి లేఖ రాసిన సీఎం కేసీఆర్.. ఏం కోరారంటే..
Telangana Weather Alert: బాబోయ్ ఎండలు.. రాష్ట్రంలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
Telangana Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై అలా చేశారంటే అంతే సంగతలు..!