వీటిని శోధించి సాధించి సీఐడీ కొన్ని అభియోగాలు కోర్టులో ఉంచింది. దాని ఆధారంగానే చంద్రబాబుపై పీటీ వారెంట్ కోరింది. ఈ కేసులో చంద్రబాబును A1గా చూపిస్తున్న సీఐడీ.. A-2గా మాజీ మంత్రి నారాయణను, A-14గా లోకేష్‌ని కూడా చేర్చింది. ఇప్పటికే నారాయణ ముందస్తు బెయిల్ దక్కించుకోగా.. చంద్రబాబుకు, లోకేష్‌కి మాత్రం తిప్పలు తప్పేలా కనిపించడంలేదు..
వాస్తవానికి CRDA అధికారులు ఖరారుచేసిన 94కిలోమీటర్ల రోడ్ మ్యాప్‌పై అప్పట్లో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని, కావాలనే తమవాళ్ల భూములున్న కాజా, కంతేరు మీదుగా కొత్త అలైన్‌మెంట్ తెచ్చేలా ఒత్తిడితెచ్చారన్నది వైసీపీ ఆరోపణ. ఫలితంగా అనుకున్న మొదటి మాస్టర్ ప్లాన్ కంటే రోడ్డు 3కిలోమీటర్ల మేర దక్షిణానికి జరిగింది. మార్చిన అలైన్‌మెంట్ వల్ల 2వేల 130 కోట్ల మేర భూ దోపిడీ జరిగిందన్నది సీఐడీ వాదన. క్విడ్‌ప్రొకోలో భాగంగానే లింగమనేని.. చంద్రబాబుకు కరకట్ట నివాసం ఇచ్చారని సీఐడీ వాదిస్తోంది. ఇక కాజా సమీపంలో భూ సమీకరణ నుంచి మినహాయించిన 2.4 ఎకరాల భూమిని పవన్ కొనుగోలు చెయ్యడం కూడా ఈ కుమ్మక్కు వ్యవహారంలో భాగమే అని చెబుతూ బాంబు పేల్చుతున్నారు వైసీపీ నేతలు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ముందుకొచ్చిన సింగపూర్ సంస్థ సుర్భానా జురాంగ్, ఉన్న స్టుప్ కన్సల్టెంట్ కూడా టెండర్లు పిలివకుండా కట్టబెట్టిన ఓ మాయాగా చెబుతున్నారు వైసీపీ నేతలు.
మ్యాప్‌లతో వైసీపీ, కేసులతో సీఐడీ చేస్తున్న ఆరోపణలు ఒకలా ఉంటే.. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. ఈ కేసేంటి, వెయ్యని రోడ్డుకి వేల కోట్ల స్కామ్ ఏంటీ అంటున్నారు టీడీపీ నేతలు. లోకేష్ అయితే ఏకంగా తప్పు చేసి ఉంటే సీఐడీ ఢిల్లీలో ఉన్న అరెస్ట్ చెయొచ్చు కదాని ప్రశ్నించారు. ఇవీ రెండు వెర్షన్స్. ఇంతకీ చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా, లోకేష్.. లింగమనేని సహా అనేకమంది పాత్రధారులుగా భూ స్కామ్ జరిగిందా.. లేదా? రూట్ మ్యాప్‌పై స్టాంప్ వేసిన CRDA అధికారులపై మాత్రం చర్యలుండవా అంటున్న టీడీపీ ప్రశ్నలకు సమాధానం ఏంటి? 2వేల 4వందల కోట్ల ప్రాజెక్ట్‌లో క్విడ్‌ప్రొకో నిజమా.. అబద్దమా? లాభపడింది ఎవరు.. నష్టపోయింది ఎవరు? అన్నది తేలాల్సి ఉంది.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..