Breaking News
  • ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. వర్షాలతో ఇసుక కొరత ఏర్పడింది. అప్పుడే దీక్షలు ఎందుకు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి. చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించలేకపోతున్నారు-వంశీ
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • రాఫెల్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు అవాస్తవమని.సుప్రీం తీర్పుతో తేటతెల్లమైంది-బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్‌. మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జఠిల సమస్యలను సామరస్య పూర్వకంగా మోదీ పరిష్కరించారు. తెలంగాణలో అశాంతి, అసంతృప్తి నెలకొంది. అధికార పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారు-లక్ష్మణ్‌
  • ముగిసిన ఆర్టీసీ, పొలిటికల్‌ జేఏసీ సమావేశం.
  • ఇసుక కొరతపై 12 గంటల పాటు దీక్ష చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు బాధితులకు అండగా నిలిస్తే దాడులు చేస్తున్నారు. ఇసుక లేక అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. నాపై కోపంతో అన్న క్యాంటీన్లు మూసేశారు-చంద్రబాబు
  • తిరుమల: సామాన్య భక్తునిగా శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పేర్నినాని. సుపథం మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పేర్ని నాని
  • ఇసుక కొరత వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది నష్టపోయారు. చంద్రబాబు మీద కక్షతోనే భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ పతాకాన్ని అవహేళన చేసింది.సచివాలయాలకు వైసీపీ రంగులేసే జగన్‌కు గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు-ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ట్యాంపరింగ్ ఆరోపణలపై టీఆర్‌ఎస్ కౌంటర్ : బిగ్ న్యూస్ – బిగ్ డిబేట్

హుజూర్‌నగర్‌లో మూడుసార్లు ఓడిపోయిన టీఆర్‌ఎస్- నాలుగోసారి మాత్రం రికార్డులు బద్దలయ్యే విక్టరీ కొట్టింది. టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ అక్కడే మకాం వేసినా, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ అక్కడికి వెళ్లకున్నా, కారుజోరు ఆగలేదు. రౌండురౌండుకు మెజారిటీ పెంచుకున్న సైదిరెడ్డి 43,624 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ కంచుకోటలో గులాబీ జెండా పాతారు. హుజూర్‌నగర్‌ గెలుపుతో టాప్‌గేర్‌లో ఉన్న టీఆర్‌ఎస్- మున్సిపల్‌ ఎన్నికల కోసం సై అంటోంది.

ఈవీఎంల ట్యాంపరింగ్: ఉత్తమ్ పద్మావతి

హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ భార్య పద్మావతి ఆరోపించారు. హైదరాబాద్‌లో కేంద్ర ఎన్నికల పరిశీలకుడిని కలిసి ఫిర్యాదు చేసిన ఆమె.. హుజూర్ నగర్ ఫలితాల్లో ఈవీఎంల ఫలితాలపై అనుమానాలున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. మెషిన్ ద్వారా వచ్చిన ఫలితం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రచారంలో ప్రజలు తమ వైపే ఉన్నారన్న పద్మావతి.. బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ రిపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం బతకాలనే తాను కోరుకుంటున్నానని చెప్పారు పద్మావతి.

మీరు గెలిచినప్పుడు టాంపరింగ్ కాదా?: టీఆర్‌ఎస్

ట్యాంపరింగ్ విషయంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ వేదికగా కీలక చర్చ జరిగింది. గతంలో కాంగ్రెస్ వాళ్లు గెలిచినప్పుడు..అదే స్థానంలో ఉత్తమ్ కుమర్ రెడ్డి పోటీ చేసి..విజయం సాధించినప్పుడు ట్యాంపరింగ్ ఆరోపణలు ఎందుకు చేయలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజశ్వేరరెడ్డి ప్రశ్నించారు.