25 శాతం లివర్‌తోనే బ్రతుకుతున్నా.. అమితాబ్‌ షాకింగ్ కామెంట్స్

Big B says 75 percent of his liver is gone, 25 శాతం లివర్‌తోనే బ్రతుకుతున్నా.. అమితాబ్‌ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం తాను  25 శాతం లివర్‌తోనే బ్రతుకుతున్నానంటూ బాలీవుడ్‌ బిగ్ బి  అమితాబ్‌ బచ్చన్‌ అందర్నీ షాక్‌కు గురి చేశారు. తాజాగా ఆయన స్వస్థ్‌ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి వేదికపై మాట్లాడారు. తరచూ తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని సూచించారు. దీని వల్ల వ్యాధిని ప్రైమరీ స్టేజ్‌లోనే గుర్తించి, సులభంగా నివారించుకోవచ్చని పేర్కొన్నారు.

‘ఒకప్పుడు నాకు క్షయ, హైపటైటిస్‌ బి వ్యాధులు ఉండేవి. దాదాపు ఎనిమిదేళ్లు వీటిని నేను గుర్తించలేకపోయాను. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల ఇలా జరిగింది. చెడు రక్తం వల్ల అప్పటికే నా కాలేయం 75 శాతం చెడిపోయింది. ఇప్పుడు నేను కేవలం 25 శాతం కాలేయంతో జీవిస్తున్నా. క్షయ వ్యాధికి నివారణ ఉంది. కానీ గుర్తించకపోవడం వల్ల నేను నష్టపోయా. ఇదంతా నేను పబ్లిసిటీ కోసం చెప్పుకోవడం లేదు. నాలాగా మరొకరు బాధపడకూడదని చెబుతున్నా. మీరు పరీక్షలు చేయించుకోలేకపోతే.. వ్యాధిని గుర్తించలేరు, ఎప్పటికీ నివారించుకోలేరు’ అని అమితాబ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *