ఖేల్ రత్నా అవార్డుకు రోహిత్ శర్మ పేరుని ప్రతిపాదించిన బిసిసిఐ

భారత వ‌న్డే టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020 కు నామినేట్ చేసిన‌ట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శనివారం ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా.. ఇశాంత్ శర్మ, శిఖర్ ధావన్,  మహిళా క్రికెటర్  దీప్తి శర్మలను అర్జున అవార్డుకు నామినేట్ చేశారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ 2016 జనవరి 1 నుండి 2019 డిసెంబర్ 31 […]

ఖేల్ రత్నా అవార్డుకు రోహిత్ శర్మ పేరుని ప్రతిపాదించిన బిసిసిఐ
Follow us

|

Updated on: May 30, 2020 | 10:05 PM

భారత వ‌న్డే టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020 కు నామినేట్ చేసిన‌ట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శనివారం ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా.. ఇశాంత్ శర్మ, శిఖర్ ధావన్,  మహిళా క్రికెటర్  దీప్తి శర్మలను అర్జున అవార్డుకు నామినేట్ చేశారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ 2016 జనవరి 1 నుండి 2019 డిసెంబర్ 31 వరకు పరిశీలన కాలంతో సంబంధిత అవార్డులకు ఆహ్వానాలను కోరింది.

రోహిత్ శర్మ 2019 వన్డే ప్రపంచ కప్‌లో భారత స్టార్‌ పెర్ఫార్మర్‌గా నిలిచాడు. అతని అద్భుతమైన ప్రదర్శన కార‌ణంగా ఐసిసి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు శ‌త‌కాలు నమోదు చేసిన రోహిత్ శర్మ.. 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 648 ర‌న్స్ చేశాడు. రోహిత్ మరో 25 ర‌న్స్ చేసుంటే..ఒక వరల్డ్‌కప్‌లో ఎక్కువ‌ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఘ‌న‌త సాధించేవాడు. 2003 వన్డే వర‌ల్డ్ క‌ప్‌లో సచిన్ టెండూల్కర్ 673 ర‌న్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు శ‌త‌కాలు న‌మోదు చేయ‌డం ద్వారా.. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచ‌రీలు నమోదు చేసిన క్రికెటర్‌గా అతను ఘనత సాధించాడు. అలానే ఇంట‌ర్నేష‌న‌ల్ టీ20ల్లో నాలుగు సెంచరీలు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ కొనసాగుతున్నాడు.