Telugu News Astrology World on the Brink? 5 Shocking Baba Vanga Predictions for 2026 That Could Change Everything
Baba Vanga: వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర భవిష్యవాణిలు నిజమైతే ఏమవుతుంది?
Baba Vanga: బల్గేరియాకు చెందిన అంధురాలైన జ్యోతిష్యురాలు బాబా వెంగా, తన దిగ్భ్రాంతికరమైన భవిష్యవాణుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆమె భవిష్యవాణులకు శాస్త్రీయ ఆధారం లేనప్పటికీ, 2026 సంవత్సరం గురించి ఆమె చేసిన వాదనలు నిపుణులలో, సాధారణ ప్రజలలో ఆందోళనలను రేకెత్తించాయి. ఆమె చేసిన 5 భయంకరమైన అంశాలు ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తున్నాయి..
Baba Vanga: బల్గేరియాకు చెందిన అంధ ప్రవక్త బాబా వెంగా భవిష్యవాణిలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆమె చెప్పిన అనేక విషయాలు గతంలో నిజమవ్వడంతో 2026 సంవత్సరం గురించి ఆమె చేసిన ఈ 5 హెచ్చరికలు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి.
వినాశనం అంచున ప్రపంచం.. 2026 గురించి బాబా వెంగా చేసిన 5 భయంకరమైన అంచనాలు:
ఉద్యోగాలపై AI దాడి: మానవ మేధస్సు స్థానాన్ని ‘యంత్ర మేధస్సు’ ఆక్రమించే రోజులు వస్తాయని ఆమె అప్పట్లోనే సూచించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెరుగుతున్న వేగం చూస్తుంటే అనేక రంగాల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
‘రాగి’ (Copper).. కొత్త బంగారం కాబోతోంది: 2026లో బంగారం, వెండి ధరలతో పాటు రాగి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయని సమాచారం. రాగి ఎంత ఖరీదైనది.. అరుదైనదిగా మారుతుందంటే, దాన్ని ‘కొత్త బంగారం’ అని పిలిచే పరిస్థితి వస్తుంది.
గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభం: 2026లో ప్రపంచం పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని (Financial Crisis) ఎదుర్కోవచ్చని ఆమె హెచ్చరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో బలహీనతలు, అప్పుల భారం పెరగడం వల్ల డిజిటల్ లావాదేవీలు, కరెన్సీపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉంది.
ప్రకృతి విపత్తులు – సప్లై చైన్ దెబ్బతినడం: వాతావరణ మార్పులు, భారీ భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థ (Global Supply Chain) పూర్తిగా దెబ్బతింటుంది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం సామాన్యుడిని కోలుకోలేని దెబ్బ తీయవచ్చు.
బంగారం ధరలో చారిత్రక పెరుగుదల: మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తాయి. ఫలితంగా బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకుంటాయి. పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కంటే బంగారం వంటి లోహాలపై పెట్టుబడి పెట్టడమే సురక్షితమని భావిస్తారు.
గమనిక: బాబా వెంగా భవిష్యవాణిలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. కేవలం ఆమెపై ఉన్న నమ్మకాలు, ప్రచారంలో ఉన్న విషయాల ఆధారంగానే ఈ సమాచారం అందిస్తున్నాము.