ఉద్యోగంలో ఆశించినంత పురోగతి ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేసే అవకాశం ఉంది. మంచి సంస్థ లో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం నుంచి మంచి కబుర్లు వింటారు. సమీప బంధువు ల రాకతో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బాగానే ఉంటాయి. విద్యార్థులకు చాలావరకు బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాబిస్తాయి.
ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈ వారం అంతా ప్రశాంతంగానే గడిచిపోతుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. స్థలం కానీ, ఇల్లు గాని కొనే ఆలోచన చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికారులు చేస్తారు. ఎవరికి హామీలు ఉండవద్దు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి సమయం బావుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా చిక్కులు ఉంటాయి. శని అష్టమ సంచారం కారణంగా మధ్యమధ్య అనుకోని సమస్యలు ఎదురవుతాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి.
ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ప్రమోషన్ కానీ, మంచి ఇంక్రిమెంట్ గాని లభించవచ్చు. ఉన్నతాధికారులు, సహ ఉద్యోగులు సహకరిస్తారు. మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఒక పెద్ద కంపెనీ నుంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఎవరికి హామీలు ఉండకండి. ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయండి. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అతి తేలికగా విజయాలు సాధిస్తారు. స్నేహితురాలితో పెళ్లి విషయాలు మాట్లాడుతారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది.
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే, అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. వడ్డీ వ్యాపారులు బాగా లాభాలు ఆర్థిస్తారు. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సేవా రంగాలలో ఉన్నవారికి సమయం అన్ని విధాల బాగుంది. వారాంతంలో విహారయాత్ర చేస్తారు. స్నేహితురాలు మీద బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. పలుకుబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి కాస్తంత తగ్గుతుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా కాలక్షేపం చేస్తారు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ ఉద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్ వస్తుంది. స్నేహితురాలితో ఉత్సాహంగా విహారయాత్ర చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.
ఆర్థిక సంబంధమైన చిక్కులు ఉంటాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. చిన్న వ్యాపారులకు, స్వయం ఉపాధి వారికి సమయం అనుకూలంగా ఉంది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సన్నిహితుల్లో ఒకరి గురించి ఆందోళన కలిగించే వార్త వింటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. స్నేహితురాలితో సరదాగా కాలక్షేపం చేస్తారు. విద్యార్థులు శ్రమ మీద విజయాలు సాధిస్తారు. హామీలు ఉండవద్దు. ఇతరులకు బాగా సహాయం చేస్తారు. కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది.
నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. మంచి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆస్తి పెంచుకునే ప్రయత్నాలను వాయిదా వేయటం మంచిది. సంతానంలో ఒకరు కొద్దిగా సమస్యలు సృష్టిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో
చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. తల్లిదండ్రులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికారులు చేస్తారు.
ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. అయితే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. స్నేహితులతో అపార్ధాలు తొలగుతాయి. శని సంచారం కారణంగా మధ్య మధ్య అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు తప్పవు. సంతానం నుంచి శుభ వార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఆలస్యం అవుతుంటాయి. విదేశాల నుంచి ఆశించిన కబురు అందుతుంది. అనవసర పరికరాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. మీ గురించి బంధువులు చెడు ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ చక్కగా పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధు వర్గం వారితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంతో విహారానికి వెళ్లే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవ రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. స్నేహితురాలికి ఖరీదైన కానుకలు కొనిస్తారు. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ బాగా లాభిస్తాయి.
నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఖర్చులు అదుపులో ఉంటాయి. చెప్పట ఎక్కువగా ఉన్న ప్పటికీ కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మీ సహాయం పొందిన స్నేహితులు ముఖం చాటేస్తారు. ఔదార్యానికి హద్దులు పెట్టుకోవడం మంచిది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. సైన్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళతారు.
నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఎక్కువగా పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు. హామీలు ఉండవద్దు.
కౌశిక్ – జ్యోతిష్య నిపుణులు