Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు వరకు వారఫలాలు..

Weekly Horoscope: ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు వారరాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు వరకు వారఫలాలు..
Weekly Horoscope
Image Credit source: TV9 Telugu

Edited By:

Updated on: Apr 23, 2023 | 7:57 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):

ఈ రాశి వారికి ఉద్యోగ పరంగాను, ఆర్థికంగానూ నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణ నెలకొని ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు ఈ రాశి వారి ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఒక విధంగా అధికార యోగానికి అవకాశం ఉంటుంది. మిగిలిన రెండు వారాల్లో ఉద్యోగ పరంగా అభివృద్ధి ఉంటుంది కానీ, ఆర్థిక పరిస్థితి కొద్దిగా వెనుక పట్టు పడుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగి కొత్త ప్రయత్నాలకు అవకాశం కలుగుతుంది. వృత్తి నిపుణులు ఉద్యోగాలు మారటానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులతో సమస్యల్లో పడతారు. పొదుపు చేయడం చాలా మంచిది. రాదనుకున్న డబ్బు అవసర సమయంలో చేతికి అందుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులు తీపి కబురు వింటారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ పరంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. చాలాకాలంగా మనసులో ఉన్న కోరిక ఒకటి అనుకోని విధంగా నెరవేరుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1):

ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది. కొత్త ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి బాగా పెరిగినప్పటికీ సకాలంలో లక్ష్యాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల వారు లాభాల బాట పడతారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ పరమైన చిక్కుల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణ ఏర్పడుతుంది. ఆర్థిక స్థోమత పెరుగుతుంది. ఐటీ తదితర వృత్తి నిపుణులు తమ తమ రంగాల్లో ముందడుగు వేస్తారు.

ఇవి కూడా చదవండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. చాలా మార్గాలలో ఆర్థికంగా కలిసి వస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. మొండి బకాయి ఒకటి వసూలు అవుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అధికారులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఉద్యోగ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా వరకు సానుకూలంగా మారే సూచనలున్నాయి. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):

చాలావరకు అనుకూలంగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులు కొంటారు. ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులు అండగా నిలబడతారు. ద్వితీయార్థంలో కొన్ని ఆందోళనకర వార్తలు వింటారు. ముఖ్యంగా దగ్గర బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విదేశాలలో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువై ఇబ్బంది పడతారు. వ్యక్తిగత జీవితం క్షణం తీరిక లేకుండా ముందుకు సాగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

ఐటీ తదితర వృత్తి నిపుణులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. గతంలో మీరు కొనుగోలు చేసిన స్థలాల విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ ప్రతిభను, సామర్థ్యాన్ని అధికారులు గుర్తిస్తారు. ఉద్యోగ పరంగా దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ చేయడం జరుగుతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. పొదుపు సూత్రాలు పాటిస్తారు. ఆర్థిక లావాదేవీలలో ఆచితూచి అడుగు వేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అంతేకాక ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందుల్లో పడతారు. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. కుటుంబానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల సమయం అన్ని విధాల బాగుంటుంది. దీనిని సద్వినియోగం చేసుకొని ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించండి. తిప్పట, శ్రమ ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలను వేగంగా నడపటం అంత మంచిది కాదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ):

కొంచెం పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలలో సొంత నిర్ణయాలు వల్ల ఫలితం ఉంటుంది. సహచరులు కొందరు మీ పైన చెడు ప్రచారం సాగించే అవకాశం ఉంది. ఉద్యోగ వాతావరణం కొన్ని చికాకులతో నిండి ఉంటుంది. ఆదాయ పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. పొదుపు చేయడం మంచిది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. మధ్య మధ్య ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. అదనపు బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. అధికార యోగానికి అవకాశం ఉంది. కుటుంబ పరంగా కొద్దిగా మానసిక ప్రశాంతత తగ్గుతుంది. బంధువుల కారణంగా కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అంది కొన్ని అవసరాలు తీరుతాయి. వ్యవసాయం, అద్దె ఇంట్లోంచి సొంత ఇంటికి మారే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సంబంధమైన ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2):

కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ పరంగా అంతా మంచే జరుగుతుంది. సానుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంతో విహారయాత్రకు వెళతారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు అనుకోకుండా చక్కబడతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. పిల్లలు పురోగతి చెందుతారు. వృత్తి వ్యాపారాల వారు లాభాలు గడిస్తారు. ఐటీ నిపుణులు విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు సాగిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు చేయి దాటి పోతాయి. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు శక్తికి మించి సహాయం చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణ నెలకొంటుంది. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మోయవలసి వస్తుంది. సహచరుల విధులను కూడా పంచుకోవలసి వస్తుంది. ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. కొందరు స్నేహితులు నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. అనుకోకుండా ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

ఈ రాశి వారికి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగానికి, ప్రమోషన్ కి అవకాశం ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. గతంలో చేసిన ఆర్థిక లావాదేవీలు మంచి లాభాలను ఇస్తాయి. ఆస్తుల కొనుగోలుకు ప్రయత్నాలు సాగిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటే అవి ఫలిస్తాయి. .

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Loading...
Unable to load recommendations.
Follow Us