Weekly Horoscope: వారికి ముఖ్యమైన వ్యక్తి గత సమస్యలు పరిష్కారం..12 రాశుల వారికి వారఫలాలు..

| Edited By: Shaik Madar Saheb

Nov 19, 2023 | 6:30 AM

వార ఫలాలు (నవంబర్ 19 నుంచి నవంబర్ 25, 2023 వరకు): మేష రాశి వారికి వారమంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనివ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారం వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Weekly Horoscope: వారికి ముఖ్యమైన వ్యక్తి గత సమస్యలు పరిష్కారం..12 రాశుల వారికి వారఫలాలు..
Weekly Horoscope
Follow us on

వార ఫలాలు (నవంబర్ 19 నుంచి నవంబర్ 25, 2023 వరకు): మేష రాశి వారికి వారమంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనివ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారం వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వారమంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. రాశ్యధిపతి అష్టమ రాశిలో స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల, గురు, శనుల బలం కూడా అధికంగా ఉన్నందువల్ల సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉందని భావించవచ్చు. ముఖ్యమైన ప్రయత్నాలు, ఆలోచనలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సతీమణితో సానుకూలత ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం, ఎవరికీ హామీలు ఉండకపోవడం ఎంతో శ్రేయస్కరం.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఒక్క గురు గ్రహం తప్ప మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. అయితే, ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. శత్రు, రోగ, రుణ బాధలు అదుపులో ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదా యక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులతో అధికారాలు పంచుకోవడం జరుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయ త్నాలు బాగా అనుకూల ఫలితా లనిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలతో అత్యవసర వ్యవహారాలు పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

శని, గురు గ్రహాల సంచారంతో పాటు, శుక్ర, రవి, కుజుల సంచారం కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనివ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు కలిసి వస్తుంది. తండ్రి తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశాలున్నాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహ కారాలు లభిస్తాయి. వారమంతా చాలావరకు ప్రశాంతంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగం సజావుగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు, గొప్ప పనులు చేస్తారు. మిత్రుల వివాదాల్లో మధ్య వర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వారమంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్య మైన వ్యవహారాలను, కొన్ని పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. వారమంతా క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సతీమణి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. కుటుంబపరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు కలిసి రాకపోవచ్చు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

నాలుగవ స్థానంలో రాశ్యధిపతి రవి, భాగ్యాధిపతి కుజుడు సంచరిస్తున్న కారణంగా, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు మీద పడతాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. సప్తమ స్థానంలో శనీశ్వరుడి కారణంగా ఇంటా బయటా కొద్దిగా పని ఒత్తిడి తప్పక పోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

శని, కుజ, రవుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తి గత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. అత్యవసర పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. దూరపు బంధువులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలలో కష్టనష్టాలు, ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ వారమంతా మీరనుకున్నట్టే జరిగే అవకాశం ఉంది. గురు, శనుల బలంతో పాటు రవి, కుజులు కూడా అనుకూలంగా మారినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపా రాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నా లకు చాలా కంపెనీల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధికి అను కూలమైన వ్యక్తులు పరిచయం అవుతారు. కొన్ని అత్యవసర వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సతీమణితో అన్యోన్యత పెరుగు తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఈ రాశిలో రాశ్యధిపతి కుజుడు రవితో కలవడం బాగానే ఉన్నప్పటికీ, అర్ధాష్టమ శని, ఆరవ స్థానంలో గురువు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి రావచ్చు. శుక్రుడు లాభ స్థానంలో ఉన్నందువల్ల శుభ వార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి అవ కాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం ఆశించిన స్థాయిలో మెరుగ్గా ఉంటుంది. కొన్ని వ్యక్తిగత విషయాల్లో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో ఎవరికీ వాదోపవాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో, తృతీ యంలో శని బాగా అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా వృత్తి, ఉద్యోగాల్లో విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సతీమణి సహాయ సహకారాలు లభిస్తాయి. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. మధ్య మధ్య స్నేహితులతో సమస్యలు తలెత్తుతుం టాయి. బాగా సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఈ వారమంతా మిశ్రమంగా గడిచిపోతుంది. లాభస్థానంలో రవి, బుధ, కుజుల సంచారం కారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అయితే, ఆదాయానికి మించి ఖర్చు పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ జీవితంలో అనుకోకుండా కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలున్నాయి. ఒక శుభ కార్యంలో దగ్గర బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

దశమ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి సంబంధమైన వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఏలిన్నాటి శనితో పాటు, కుటుంబ స్థానంలో రాహువు సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు సమస్యాత్మకంగా మారతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి భంగపడతారు. దైవ కార్యాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొంటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రాశ్యధిపతి గురువు ద్వితీయ స్థానంలో, భాగ్యాధిపతి కుజుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు బాగా పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సునాయా సంగా పూర్తి చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మంచి ఆఫర్లు అందివస్తాయి.