AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీఎం మోదీ జాతకానికి ‘ఫోటోకాపీ’ లాంటిదే సీఎం విజయ్ జాతకం.. ప్రధానమంత్రి అవుతారా?

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు దళపతి విజయ్. టీవీకే పార్టీ సాధించిన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఎన్నికల ముందు వరకు రాజకీయ విశ్లేషకులు, ప్రజాభిప్రాయ సర్వేలు విజయ్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని అంచనా వేశాయి. కానీ, ఆ ప్రతికూల వాతావరణంలోనూ విజయ్ గెలుపును ముందే ఊహించి, ఆయన ముఖ్యమంత్రి అవుతారని బలంగా చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు రికీ రతన్ పండిట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

పీఎం మోదీ జాతకానికి 'ఫోటోకాపీ' లాంటిదే సీఎం విజయ్ జాతకం.. ప్రధానమంత్రి అవుతారా?
Tami Nadu Cm Vijay
Balaraju Goud
|

Updated on: May 16, 2026 | 6:01 AM

Share

సినిమా రంగుల ప్రపంచం నుంచి రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టి, తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు దళపతి విజయ్. టీవీకే పార్టీ సాధించిన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఎన్నికల ముందు వరకు రాజకీయ విశ్లేషకులు, ప్రజాభిప్రాయ సర్వేలు విజయ్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని అంచనా వేశాయి. కానీ, ఆ ప్రతికూల వాతావరణంలోనూ విజయ్ గెలుపును ముందే ఊహించి, ఆయన ముఖ్యమంత్రి అవుతారని బలంగా చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు రికీ రతన్ పండిట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే, విజయ్ విజయం సాధిస్తారనే నమ్మకంతో ఆయన నివాసానికి పూలగుచ్ఛంతో వెళ్లి అభినందనలు తెలిపిన మొదటి వ్యక్తి రికీ రతన్ పండిట్ కావడం విశేషం. తాజాగా ఒక ప్రైవేట్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విజయ్ జాతకం, ఆయన భవిష్యత్తు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ, “విజయ్‌కు జ్యోతిష్యంపై పెద్దగా నమ్మకం లేదు. కానీ, మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కేవలం జ్యోతిష్యానికి పరిమితమైనది కాదు, అది ఒక తండ్రీకొడుకుల బంధం, విడదీయరాని స్నేహం. ఈ అసలు విషయం తెలియక చాలామంది ప్రస్తుతం రకరకాల ఊహాగానాలు చేస్తూ మమ్మల్ని ముడిపెట్టి మాట్లాడుతున్నారు” అని పండిట్ స్పష్టం చేశారు.

విజయ్ రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ రికీ రతన్ పండిట్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రధానమంత్రి యోగం గురించి మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కు భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రి అయ్యే అత్యున్నత జ్యోతిష్య యోగం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయ్ జాతకం, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతకాన్ని అచ్చం ఒక ఫోటోకాపీలా పోలి ఉందని పండిట్ వ్యాఖ్యానించారు. రాబోయే 30 నుండి 40 ఏళ్ల పాటు విజయ్ రాజకీయాల్లో ఎటువంటి నిజమైన పోటీని ఎదుర్కోకుండా, ఒక తిరుగులేని ఆధిపత్య శక్తిగా ఎదుగుతారని ఆయన జోస్యం చెప్పారు.

రాబోయే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతూ, ప్రధాని మోదీకి ఉన్న జ్యోతిష్య యోగంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేవలం పావు వంతు మాత్రమే ఉందని ఆయన విశ్లేషించారు. అయితే, 2029 ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయని రికీ రతన్ పండిట్ పేర్కొన్నారు. ఆ సమయంలో నరేంద్ర మోదీకి ‘రాహు దశ’, ‘రాహు భుక్తి’ కాలాలు నడుస్తుంటాయని, తత్ఫలితంగా ఆయన మళ్ళీ ప్రధానమంత్రి కావడం జ్యోతిష్యపరంగా కష్టమవుతుందని చెప్పారు. సరిగ్గా అదే సమయంలో దేశంలో ఒక బలమైన ‘మూడవ కూటమి’ (Third Front) ఆవిర్భవించడం ఖాయమన్నారు. అప్పుడు విజయ్ తన జాతక బలం ప్రకారం అత్యున్నత శిఖరాగ్రంలో ఉంటారని వెల్లడించారు. ఈ వ్యాఖ్యల ద్వారా భవిష్యత్తులో విజయ్ దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించే అవకాశాలు మెండుగా ఉన్నాయని రికీ రతన్ పండిట్ పరోక్షంగా సూచించారు. ప్రస్తుతం ఈ జ్యోతిష్య విశ్లేషణ అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us