Shukra Gochar 2024: మకర రాశిలో శుక్రుడి.. ఆ రాశుల వారికి మహా యోగాలు

| Edited By: Janardhan Veluru

Nov 25, 2024 | 5:21 PM

Venus Transit 2024: డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు శుక్రుడు మకర రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మకర రాశి శుక్రుడికి అత్యంత ఇష్టమైన రాశి. పైగా రాశినాథుడు శని ప్రాణ మిత్రుడు. భోగభాగ్యాలకు, శృంగారానికి, ప్రేమలు, పెళ్లిళ్లు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల..

Shukra Gochar 2024: మకర రాశిలో శుక్రుడి.. ఆ రాశుల వారికి మహా యోగాలు
Shukra Gochar 2024
Follow us on

డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు శుక్రుడు మకర రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మకర రాశి శుక్రుడికి అత్యంత ఇష్టమైన రాశి. పైగా రాశినాథుడు శని ప్రాణ మిత్రుడు. భోగభాగ్యాలకు, శృంగారానికి, ప్రేమలు, పెళ్లిళ్లు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల ఈ లక్షణాలన్నీ రెట్టింపు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి అనేక శుభ ఫలితాలు తప్పకుండా అనుభవానికి వస్తాయి.

  1. మేషం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఉద్యోగపరంగా కీలకమైన శుభ పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగం ఎటువంటి చీకూ చింతా లేకుండా సాగిపోతుంది. పదోన్న తికి, పని భారం తగ్గడానికి, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా అంచనాలకు మించి రాణిస్తాయి. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. విలాస జీవితం అల వడుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది.
  2. వృషభం: రాశినాథుడు శుక్రుడు భాగ్య స్థానంలో సంచారం ప్రారంభించినందువల్ల తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగు లకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. తీర్థయాత్రలు, విహార యాత్రలకు బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదో న్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలతో పాటు రాబడి బాగా వృద్ధి చెందుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి తగ్గి, పదోన్నతులు లభించి, నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించి పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజ యాలు సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమై, అన్యోన్యత పెరు గుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ప్రతిభా పాటవాలకు సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదే వీలు బాగా వృద్ది చెందుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. తీర్థ యాత్రలు, విహార యాత్రలు చేయడం జరుగుతుంది.
  5. తుల: రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం కలిగింది. దీనివల్ల తప్పకుండా ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా ఆశించిన పురోగతి సాధిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. గృహ, వాహన ప్రయ త్నాలు విజయవంతం అవుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  6. మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ఈ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి శుభ యోగాలు పట్టడం ప్రారంభమవుతుంది. వ్యక్తిగత జీవితంలో అనేక అనుకూలతలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. పని భారం, పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి వంటివి పూర్తిగా తగ్గిపోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది.