Loading video

ఉగాది పంచాంగం 2025 : వృషభ రాశి వారి ఫలితాలు ఇవే!

|

Mar 29, 2025 | 7:31 AM

వృషభ రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగాన్ని ఆధారంగా ఈ రకమైన గ్రహస్థితి సంవత్సరం ఉండబోతుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానం, కుటుంబస్థానం, వాక్ స్థానంలో బృహస్పతి సంచరించడం, లాభస్థానంలో శని అనుకూలంగా సంచరించడం, దశమ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో కేతువు అనుకూలంగా వ్యవహరించడం చేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన, అనుకూలమైన సంవత్సరం. గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు, ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటకు వస్తారు. ఈ సంవత్సరం శుభకార్యాలు అంటే వివాహాలు చేస్తారు. వృషభరాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అభివృద్ధి కనబడబోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు కలిసి వస్తాయి.

వృషభ రాశి రాజకీయ నాయకులకు ఇది అద్భుతమైన సంవత్సరం. మీరు చేసే పనులలో ఆదరణ అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. వృషభ రాశి రైతాంగం, సినీరంగం, మీడియా రంగం వంటి రంగాలలో ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వృషభ రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వ్యాపారపరంగా లాభదాయకంగా ఉండబోతుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి విశ్వవసు నామ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల మరియు సత్ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. చతుర్థ స్థానంలో ఉన్న కేతువు ప్రభావం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు, ఇబ్బంది పెట్టొచ్చు. వృషభ రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలంటే చిలకమర్తి పంచాంగం ఈ రకమైనటువంటి పరిహారాలు మీరు పాటించాలి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా లక్ష్మీ దేవిని పూజించడం, కనకధారా స్తోత్రం అంటే స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే వృషభ రాశి వారు శ్రీకృష్ణుడిని పూజించి శ్రీకృష్ణుడికి పాలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు.