Jupiter astrology: గురువు ఇష్టపడే అదృష్ట రాశులు ఇవే.. వీరికి ఏ కష్టమూ రానివ్వడు.. మీ రాశి ఉందో తెలుసుకోండి

Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో గురువును చాలా శుభప్రదమైన, ప్రభావంతమైన గ్రహంగా భావిస్తారు. గురువు సంతోషంగా ఉన్నప్పుడు.. జీవితం అభివృద్ధి పథంలో నడుస్తుంది. అతడి అదృష్టం కూడా పెరుగుతుంది. గురువు కష్టమైన పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చేస్తాడు. జాతకంలో గురువు బలంగా ఉన్నప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. అలాంటి వ్యక్తులు సమాజంలో గౌరవించబడతారు.

Jupiter astrology: గురువు ఇష్టపడే అదృష్ట రాశులు ఇవే.. వీరికి ఏ కష్టమూ రానివ్వడు.. మీ రాశి ఉందో తెలుసుకోండి
Guru Graha

Updated on: Jan 30, 2026 | 10:07 AM

Zodiac Signs Astrology: జ్యోతిష్యశాస్త్రంలో బృహస్పతిని గురువు అని పిలుస్తారు. దేవతలకు మార్గదర్శనం చేసినందున ఆయనను దేవ గురువు అని చెబుతారు. సాధారణంగా గురువును జ్ఞానం, ఆధ్యాత్మికత, అదృష్టాన్ని ప్రసాదించే దేవుడిగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో గురువును చాలా శుభప్రదమైన, ప్రభావంతమైన గ్రహంగా భావిస్తారు. గురువు సంతోషంగా ఉన్నప్పుడు.. జీవితం అభివృద్ధి పథంలో నడుస్తుంది. అతడి అదృష్టం కూడా పెరుగుతుంది. గురువు కష్టమైన పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చేస్తాడు. జాతకంలో గురువు బలంగా ఉన్నప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. అలాంటి వ్యక్తులు సమాజంలో గౌరవించబడతారు. విశ్వసించబడతారు. గురువు సంపదను మాత్రమే కాకుండా సానుకూల ఆలోచనను కూడా కలిగిస్తాడు.

వివాహ జీవితం సమతుల్యంగా ఉంటుంది. స్త్రీ జాతకంలో గురువు మంచి జీవిత భాగస్వామిని, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని సూచిస్తాడు. ఆరోగ్య దృక్కోణం నుంచి గురువు జీర్ణక్రియ, శక్తితో సంబంధం కలిగి ఉంటాడు. గురు భగవాన్‌కు అత్యంత ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభం

వృషభ రాశి వారిని శుక్రుడు పాలిస్తాడు. కానీ, అది స్థిర భూమి రాశి. గురువు జ్ఞానం వృషభ రాశి స్థిరత్వంతో కలిస్తే.. వారు శారీరకంగా, మానసికంగా బలంగా మారతారు. అలాంటి వారు కృషి ద్వారా శాశ్వత విజయాన్ని సాధిస్తారు.

ధనుస్సు

ధనస్సు రాశి గురువు జన్మించిన రాశి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సహజంగా నిజాయితీపరులు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితంలో మంచి అవకాశాలను పొందుతారు. వారు విద్య, వృత్తిలో రాణిస్తారు.

మీనం

మీనం అనేది గురువు యొక్క స్థానిక రాశి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు భావోద్వేగపరంగా సున్నితంగా ఉంటారు. ఈ రాశివారు ఆధ్యాత్మకత వైపు మొగ్గు చూపుతారు. గురువు అనుగ్రహంతో ఈ రాశివారు జీవితంలో మంచి మార్గదర్శకత్వం పొందుతారు.

ఈ మూడు రాశులపై గురువు అనుగ్రహం ఎలా ఉంటుందంటే.?

సంపద.. వృషభం, ధనుస్సు, మీన రాశులలో జన్మించిన వ్యక్తులు అరుదుగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. వారికి ఆదాయ అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. సంపద సులభంగా పేరుకుపోతుంది.

విద్య, ఉద్యోగం.. ఈ మూడు రాశులవారు చదువులో రాణిస్తారు. జ్ఞానంతో ముందుకు సాగుతారు. విద్య, కన్సల్టింగ్, బ్యాంకింగ్, పరిపాలన, చట్టం వంటి రంగాలలో ఉన్నత పదవులు, గుర్తింపును పొందుతారు.

కుటుంబ జీవితం.. గురువు ప్రభావంతో ఈ మూడు రావుల వారి కుటుంబంలో గౌరవించబడతారు. సంబంధాలు సామరస్య పూర్వకంగా ఉంటాయి. వారు తరచుగా పిల్లల నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు.

ఆధ్యాత్మికత, సేవ.. వృషభం, ధనస్సు, మీనం రాశులవారు ఆధ్యాత్మిక భావన కలిగి ఉంటారు. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. సహజంగానే సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే భావాన్ని పెంచుకుంటారు. గురువు ఈ మూడు రాశులవారిని ఎప్పుడూ కష్టమైన పరిస్థితుల్లో కాపాడుతూనే ఉంటారు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.)