
మేష రాశి: మేష రాశిలోనే బృహస్పతి తిరోగమనం చేయనుండడంతో మేష రాశి వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి. మేష రాశికి కుజుడు అధిపతి అయినందున బృహస్పతి తిరోగమన కాలంలో ఈ రాశివారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే వృధా ఖర్చులు తొలగిపోయి ఆదాయం పెరుగుతుంది. ఇంకా బంధుమిత్రుల నుంచి మద్ధతు లభిస్తుంది.

సింహ రాశి: సింహరాశికి సూర్యుడు అధిపతి. ఇంకా మేషరాశిలో బృహస్పతి తిరోగమనం కారణంగా మిమ్మల్ని వెంటాడుతున్న వివాదాలు తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు ఆర్థికంగా స్థిరపడతారు. కొత్త వ్యాపార మార్గాలతో లాభాలను గడిస్తారు. వైవాహిక జీవితంలోని గొడవలు తొలగిపోతాయి.

తులా రాశి: దేవ గురు బృహస్పతి తిరోగమనం తులా రాశివారికి అనేక అనేక ప్రయోజనాలను కలుగుతాయి. ఈ తిరోగమన కాలంలో శుక్రుడి ఆధీనంలోని తులా రాశివారి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు పొందుతారు. నలుగురిలో మీపై గౌరవం పెరుగుతుంది.

మీనం: మీన రాశికి దేవ గురువే అధిపతి. ఈ కారణంగా బృహస్పతి తిరోగమన సమయంలో మీన రాశివారికి శుభం కలుగుతుంది. ఈ సమయంలో మీ అప్పుల బాధలు తొలగిపోయి, అర్థికంగా స్థిరపడతారు. అలాగే మీకు పదోన్నతి లభిస్తుంది.

Note: ఇక్కడ తెలియజేసిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తి, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.