Solar Eclipse 2022: ఈ నెల 30న సూర్యగ్రహణం, శనిశ్చరి అమావాస్య ఒకే రోజు, ఈ 3 రాశుల వ్యక్తులపై తీవ్ర ప్రభావం.. జాగ్రత్తగా ఉండాలని సూచన

|

Apr 27, 2022 | 7:42 PM

Solar Eclipse 2022: పంచాంగం ప్రకారం.. వైశాఖ కృష్ణ పక్షంలోని అమావస్య రోజున ఈ ఏడాది (2022) మొదటి సూర్యగ్రహణం.. ఈనెల(ఏప్రిల్) 30వ తేదీన  ఏర్పడనున్నది. ఇది పాక్షిక సూర్యగ్రహణం..

Solar Eclipse 2022: ఈ నెల 30న సూర్యగ్రహణం, శనిశ్చరి అమావాస్య ఒకే రోజు, ఈ 3 రాశుల వ్యక్తులపై తీవ్ర ప్రభావం.. జాగ్రత్తగా ఉండాలని సూచన
Solar Eclipse 2022
Follow us on

Solar Eclipse 2022: పంచాంగం ప్రకారం.. వైశాఖ కృష్ణ పక్షంలోని అమావస్య రోజున ఈ ఏడాది (2022) మొదటి సూర్యగ్రహణం.. ఈనెల(ఏప్రిల్) 30వ తేదీన  ఏర్పడనున్నది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఏప్రిల్ 30వ తేదీ అమావస్య శనివారం  కనుక ఈరోజున శనిశ్చరి అమావస్య(Shanishchari Amavasy)అని కూడా అంటారు. ఈ రోజున దానం చేయడం, నదీ స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సూర్యగ్రహణం ప్రభావం అన్ని రాశుల మీద ఉన్నా.. ప్రధానంగా ఓ మూడు రాశుల వ్యక్తులపై ఎక్కువగా ఉంటుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్యస్త్రం చెబుతోంది. ఆ మూడు రాశులు(3 Zodiac Signs) ఏవో తెలుసుకుందాం.

సూర్యగ్రహణం ఎక్కడ కనిపించనున్నదంటే: 
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కొన్ని ఇతర దేశాల్లో కనిపించనుంది. దీంతో భారత కాలమాన ప్రకారం ఏప్రిల్ 30 మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే మే 1 ఉదయం 04:07 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం అంటార్కిటికా, అట్లాంటిక్, దక్షిణ అమెరికాలోని నైరుతి భాగం, పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది, అయితే మేషం, కర్కాటకం ,  వృశ్చికం  రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

మేషరాశి: 
మేషరాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కాబట్టి దీని ప్రభావం మేషరాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఈ సందర్భంలో, మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే నష్టపోవచ్చు. ఈ రాశి వారు ఏ పనిలోనైనా తొందరపడకూడదు. సూర్యగ్రహణం సమయంలో ప్రయాణం చేయడం అశుభం.

కర్కాటక రాశి: 
ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ సమయంలో, చంద్రుడు రాహువుతో కలిసి మేషరాశిలో ఉంటాడు. ఈ రాశి వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. భయం , ప్రతికూలత అధికంగా ఉంటుంది. అంతేకాదు అధికంగా ఖర్చులు చేయాల్సి రావచ్చు. ఈ రాశి ప్రజలు సహనంతో ఉండటం అవసరం.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు గౌరవాన్ని కోల్పోవలసి రావచ్చు. కనుక ఈ సమయంలో, ఏదైనా పని చేసే ముందు ఆలోచించాల్సి ఉంటుంది. శత్రువులు హాని కలిగించవచ్చు. ఇతరులతో వాదనలు మానుకోండి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

 

Also Read: UP CM Yogi: మంత్రులు అధికారులు.. ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టండి.. యూపీ సీఎం యోగి కీలక ఆదేశం!

Humanity: ఇలాంటి వారిని చూస్తేనే.. ఇంకా మానవత్వం ఉంది అనిపించేది.. రోడ్డు మీద చిన్నారి దాహార్తిని తీర్చిన ఓ మహిళ