Zodiac Signs
ఈ నెల 15న వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న రవి గ్రహం ఊహించని విధంగా కొన్ని అనుకూలతలను, శుభ ఫలితాలను కలిగిస్తుంది. స్థిర రాశి అయిన వృషభం కంటే, ద్విస్వభావ రాశి అయిన మిథునంలో రవి చురుకుగా, క్రియాశీలంగా వ్యవహరిస్తాడు. మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశులకు ఊహించని శుభ ఫలితాలనిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నవారికి తప్పకుండా శుభ ఫలితాలు అందుతాయి. మిథున రాశిలో రవి గ్రహం జూలై 16 వరకూ సంచారం చేయడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి గ్రహ ప్రవేశం వల్ల జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబడతాయి. ఊహించని ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా లాభదాయకంగా నెరవేరుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. విహార యాత్రలకు అవకాశం ఉంది. ప్రభుత్వ మూలక ధన లాభం ఉంది. ప్రభుత్వోద్యోగాలకు ప్రయత్ని స్తున్న వారికి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది.
- వృషభం: ఈ రాశివారికి ధన స్థానంలో సూర్య సంచారం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. భూ క్రయ విక్రయాల్లో అత్యధికంగా లాభాలు పొందుతారు. గృహ, వాహన యోగాలు పడతాయి. ప్రభు త్వంలో లేక ప్రభుత్వ సంబంధమైన సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారికి మంచి అదృష్టం పడుతుంది. పిత్రార్జితం లభించే సూచనలున్నాయి. ఉద్యోగంలో అధి కారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ధన ప్రవాహం ఉంటుంది. మాటకు విలువ పెరుగుతుంది.
- సింహం: ఈ రాశ్యధిపతి అయిన రవి లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి లభించడం, జీతభత్యాలు పెరగడం, అదనపు ఆదాయానికి అవకాశం ఉండడం వంటివి జరుగుతాయి. ప్రభుత్వమూలక ధన లాభం ఉంటుంది. ప్రభుత్వపరంగా గౌరవ మర్యాదలు లభి స్తాయి. ప్రతిభా పాటవాలకు సర్వత్రా గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారు ఇచ్చే సలహాలు, సూచ నలు బంధుమిత్రులకు బాగా ఉపకరిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల విశేష ధన లాభం ఉంటుంది.
- కన్య: ఈ రాశివారికి దశమ స్థానంలో రవి ప్రవేశం వల్ల దిగ్బలం పట్టింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో రాజ యోగం కలుగుతుంది. ఉద్యోగపరంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యో గంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. నిరుద్యోగులకు అంచనాలకు మించిన మంచి ఉద్యోగం లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యో గంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- ధనుస్సు: ఈ రాశివారికి భాగ్యాధిపతి అయిన రవి సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపో తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కలలో కూడా ఊహించని ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి సమూలంగా మారిపోతుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- మకరం: ఈ రాశికి ఆరవ స్థానంలోకి రవి ప్రవేశించడం వల్ల ముఖ్యంగా కొన్ని సమస్యలు పరిష్కారం అవు తాయి. ఆరోగ్య సమస్య నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరు గుపడి, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి, ఉద్యోగంలో ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి బాగా తగ్గుతుంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది.