SunTransit in Leo: నేడు సింహరాశిలో అడుగు పెట్టనున్న సూర్యుడు.. ఈ ఏడు రాశులవారు పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారా..

|

Aug 17, 2023 | 9:45 AM

పంచాంగం ప్రకారం సూర్యుడు కర్కాటకరాశిని విడిచిపెట్టి సింహరాశిలో సంచరించబోతున్నాడు. దీని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల జీవితాల్లో పెను మార్పులు సంభవించనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ వ్యక్తి జాతకంలో, గౌరవం, విశ్వాసం, సంకల్ప శక్తి, కీర్తి, ప్రతిష్టలు మొదలైన వాటికి కారకంగా పరిగణించబడే సూర్యుడి ఈ రాశి మార్పు వలన కొన్ని రాశుల వారికీ  శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.. 

SunTransit in Leo: నేడు సింహరాశిలో అడుగు పెట్టనున్న సూర్యుడు.. ఈ ఏడు రాశులవారు పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారా..
Suntransit In Leo
Follow us on

జ్యోతిష్యశాస్త్రంలో నవగ్రహాల రాజు సూర్యుడు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడతాడు. అయితే సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు మరింత ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ రోజు 17 ఆగస్టు 2023న పంచాంగం ప్రకారం సూర్యుడు కర్కాటకరాశిని విడిచిపెట్టి సింహరాశిలో సంచరించబోతున్నాడు. దీని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల జీవితాల్లో పెను మార్పులు సంభవించనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ వ్యక్తి జాతకంలో, గౌరవం, విశ్వాసం, సంకల్ప శక్తి, కీర్తి, ప్రతిష్టలు మొదలైన వాటికి కారకంగా పరిగణించబడే సూర్యుడి ఈ రాశి మార్పు వలన కొన్ని రాశుల వారికీ  శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

వృషభ రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశిలో సూర్యుని సంచారంతో భూమి, భవనం మొదలైన వాటిని కొనాలనుకునే వారి కలలను నిజం అయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఇల్లు కొనాలన్న కోరిక నెరవేరుతుంది.  ఎంతో మేలు జరుగుతుంది. సూర్యుడు సింహరాశిలో ఉన్నంత కాలం వృషభ రాశి వారికి శుభం కలుగుతుంది. ఈ సమయంలో, వారు జీవితంలోని అన్ని ఆనందాలను పొందుతారు. వృత్తి-వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.

పరిహారం: సూర్యుడిని పూజిస్తూ ప్రతిరోజూ ఆదిత్య హృదయ్ స్తోత్రాన్ని పఠించండి.

ఇవి కూడా చదవండి

సింహ రాశి : సూర్యుడు సింహరాశిలో సంచరించే సమయంలో ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. సూర్యుడు తన రాశిలో ఉన్నంత కాలం ఈ రాశి వారు అనుకున్న ప్రతి కల నెరవేరే అవకాశం ఉంది. అంతేకాదు జీవితంలోని ప్రతి రంగంలో తమ దగ్గర, ప్రియమైన వారి మద్దతును పొందుతారు. ఈ సమయంలో మీరు ప్రత్యేక గౌరవంతో సత్కరించబడే అవకాశం ఉంది. శత్రువుల చేసే కుతంత్రాలు విఫలమవుతాయి.. ఓటమిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో వీరు ప్రభుత్వం నుండి ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.

పరిహారం: ప్రతిరోజూ ఉదయించే సూర్యుడిని దర్శించి పూజించండి.

మిధునరాశి: సింహరాశిలో సూర్యుని సంచారం మిథునరాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో, వీరిలో శక్తి, విశ్వాసం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో కృషికి తగిన ఫలితాలను పొందుతారు. జీవితానికి సంబంధించిన గొప్ప విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ప్రియమైనవారి మద్దతు పొందుతారు. పితృ ఆస్తులు అందుతాయి. ధన-ధాన్యాలు పెరుగుతాయి.

పరిహారం: కుంకుమ, అక్షతలను నీటిలో కలిపి ప్రతిరోజూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి

కన్య రాశి: ఈ రాశి వారికి సూర్యుని రాశి మార్పు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వ్యక్తుల కష్టమైన పని పూర్తవుతుంది. కన్యా రాశికి చెందిన వారు వివిధ వనరుల నుండి డబ్బు పొందుతారు. అయితే సంపాదనకు తగిన వ్యయం ఉంటుంది. సూర్యుని రాశి మార్పు విదేశాలలో పని చేసే వారికి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. కొత్త పురోభివృద్ధి దారులు ఏర్పడతాయి. రుణ విముక్తి కలుగుతుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు.

పరిహారం: ప్రతిరోజూ సూర్య సాధన చేయండి.. తండ్రిని గౌరవించండి.

తుల రాశి: ఈ రాశివారికి సింహ రాశిలో సూర్యుని సంచారం జీవితంలో కొత్త అవకాశాలను తెస్తుంది. ఈ సమయంలో, మీ ఆదాయానికి కొత్త వనరులు సృష్టించబడతాయి. అన్ని వైపుల నుండి ప్రయోజనాలను పొందుతారు. ఇంట్లో, వెలుపల ప్రజల సహకారం, మద్దతు ఉంటుంది. సూర్యదేవుని అనుగ్రహంతో ఆఫీసులో,  సమాజంలో కొత్త గుర్తింపును పొందుతారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు.

పరిహారం: ప్రతిరోజూ నీటిలో కుంకుమపువ్వు వేసి స్నానం చేసి సూర్య మంత్రాన్ని జపించండి.

వృశ్చికరాశి: సూర్యుని రాశిలో మార్పు వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో తమ పై అధికారుల నుండి విశేష సహకారం, ప్రయోజనాలను పొందుతారు. నిలిచిపోయిన పని పూర్తవుతుంది. ఈ సమయంలో మీరు కొత్త పథకాలలో చేరడం ద్వారా పని చేసే అవకాశాన్ని పొందుతారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకు గౌరవం సాధారణ ప్రజలలో పెరుగుతుంది. తండ్రితో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. సామాజిక సేవలో భాగస్వామ్యులైన వ్యక్తులు గౌరవించబడతారు.

పరిహారం: ప్రతిరోజూ సూర్యుడిని ఆరాధించండి.. సూర్య మంత్రాన్ని జపించండి.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి స్థానికులకు, సింహరాశిలో సూర్యుని మార్పు వృత్తిలో పురోగతిని..  వ్యాపారంలో విస్తరణను తెస్తుంది. జీవనోపాధి కోరిక నెరవేరుతుంది. సూర్యుని రాశి మారిన వెంటనే ధనుస్సు రాశి వారి జీవితంలో పెను మార్పు వస్తుంది. ఈ రాశి వారికి సంబంధించిన అసంపూర్తి పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ సమయంలో ఈ రాశి ప్రజల మనస్సు మత-ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మునిగిపోతుంది. ఉన్నత విద్యలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.

పరిహారం: భాస్కరుడిని పూజించేటప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి.

మీనరాశి: సింహరాశిలో సూర్యుని సంచారం మీన రాశి వారికి విజయాన్నీ శుభాన్నిస్తుంది. ఈ సమయంలో, పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశించిన విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో, మీన రాశి వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.  విశ్వాసం, శక్తి పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.  ఉద్యోగస్తులకు స్థానం, స్థాయి పెరుగుతుంది.

పరిహారం: ప్రతిరోజూ రాగి పాత్రలో నీటిని నింపి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)