Sun Transit: మిథున రాశిలోకి రవి.. వారు ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..!

గ్రహరాజు రవి జూన్ 16న మిథున రాశిలోకి ప్రవేశించి జూలై 16 వరకు అక్కడే సంచరించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రవి అనుకూలంగా ఉంటే రాజయోగాలు, అధికారం, గౌరవం లభిస్తాయి. అయితే ఈ సంచారం ప్రభావంతో మేషం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి అధికార సంబంధిత సమస్యలు, అనవసర ఖర్చులు, ఆరోగ్య ఇబ్బందులు వంటి కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Sun Transit: మిథున రాశిలోకి రవి.. వారు ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..!
Sun Transit

Edited By:

Updated on: Jun 16, 2026 | 4:55 PM

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ గ్రహ రాజు రవి బలంగా, అనుకూలంగా ఉన్నంత కాలం జీవితం రాజసంగా, రాజయోగంగా గడిచిపోతుంది. రవి ప్రతికూలంగా ఉన్న పక్షంలో అధికారులతో సమస్యలు, తండ్రితో విభేదాలు, తండ్రికి అనారోగ్యం, వైఫల్యాలు, అనవసర ఖర్చులు, అనవసర పరిచయాలు వంటివి బాగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రవి అనుకూలంగా లేనప్పుడు శరీరంలో శక్తి క్షీణిస్తుంది. ఈ నెల(జూన్) 16న మిథున రాశిలో ప్రవేశించి జూలై 16 వరకు అదే రాశిలో కొనసాగడం జరుగుతుంది. రవి మిథున రాశి సంచారం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులవారికి కొన్ని కష్టనష్టాలు తప్పకపోవచ్చు.

  1. మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల ఆదాయం వృద్ధి చెందినప్పటికీ అంతకు మించి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కలిగినా తలకు మించిన బాధ్యతలతో, విపరీత మైన ఒత్తిడితో ఇబ్బంది పడడం జరుగుతుంది. ఉద్యోగంలో పొరపాట్లు చేయడం, అనాలోచితంగా వ్యవహరించడం వంటివి జరిగే అవకాశం కూడా ఉంది. పిల్లల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సమర్థతకు ఆశించిన గుర్తింపు లభించదు. షేర్లు, స్పెక్యులేషన్ల జోలికి వెళ్లకపోవడం మంచిది.
  2. మిథునం: ఈ రాశిలోకి రవి ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం బాగా తగ్గుతుంది. ఏ విషయం లోనూ చొరవ తీసుకోలేకపోవడం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వంటివి జరుగుతాయి. ప్రయాణాల వల్ల నష్టపోతారు. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగావకాశాలు, ఆదాయ వృద్ధి అవకాశాలు చేజారుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఆశాభంగాలు తప్పకపోవచ్చు. అనుకోని ఖర్చులు, వృథా ఖర్చులు తప్పకపోవచ్చు.
  3. కర్కాటకం: ఈ రాశికి వ్యయ స్థానంలో రవి సంచారం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృధా అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు ఉంటాయి. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా తగ్గుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల వల్ల బాగా ఒత్తిడికి గురవుతారు. బంధుమిత్రుల్లో ముఖ్యమైనవారు దూరమయ్యే అవకాశం ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతిగా అత్యంత శుభుడైన రవి అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ శ్రమాధిక్యత ఉంటుంది. తండ్రి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందకపోవచ్చు. అధికారులతో సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వం నుంచి రావలసిన సొమ్ము ఆగిపోయే అవకాశం ఉంది. బంధుమిత్రులు అపనిందలు వేసే అవకాశం ఉంది. కోర్టు కేసులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశికి షష్ట స్థానంలో రవి సంచారం వల్ల తండ్రితో విభేదాలు, అధికారుల ఆగ్రహాలు, కుటుంబ సభ్యుల అసంతృప్తి వంటివి కొద్దో గొప్పో అనుభవానికి వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా ఇబ్బందులకు గురవుతారు. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందక అవస్థలు పడతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు ఊహించని నష్టాలు కలిగిస్తాయి.
  7. మీనం: ఈ రాశికి షష్ట స్థానాధిపతి అయిన రవి చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల సుఖ సంతోషాలు బాగా తగ్గుతాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఒక పట్టాన ఫలించకపోవచ్చు. ప్రభుత్వం నుంచి ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది.
Follow Us