Sun Transit: కర్కాటక రాశిలోకి రవి.. ఆ రాశి ఉద్యోగులకు తిరుగే ఉండదు..!
Career Astrology: జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి శుభకాలం ప్రారంభం కానుంది. ఈ సంచారం ప్రభావంతో మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి రాజయోగాలు ఏర్పడి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాల్లో విశేష పురోగతి కనిపించనుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలతో పాటు ఆదాయం, గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Sun Transit Rajayoga
జూలై 16న గ్రహ రాజు రవి తనకు మిత్ర క్షేత్రమైన కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. కర్కాటక రాశిలో రవికి స్వక్షేత్ర బలం కలుగుతుంది. రవి ఇక్కడ ఉన్న నెల రోజుల్లో కొన్ని రాశుల వారిని తప్పకుండా అందలాలు ఎక్కించడం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి తప్పకుండా రాజయోగాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు సక్సెస్ అవుతారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
- మేషం: ఈ రాశికి అత్యంత శుభుడైన రవి చతుర్థ స్థానంలో సంచారం ప్రారంభించడంవల్ల శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. ఆదా యాన్ని పెంచుకోవడానికి తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. మంచి మిత్రులు ఏర్పడతారు. బంధువులతో ఆస్తి, ఆర్థిక సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది.
- వృషభం: ఈ రాశికి చతుర్ధాధిపతిగా అత్యంత శుభుడైన రవి తృతీయ స్థానంలో ప్రవేశించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. పిత్రార్జితం లభించే అవకాశం కూడా ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.
- కర్కాటకం: ధనాధిపతి రవి ఈ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. తండ్రి వైపు నుంచి బాగా కలిసి వస్తుంది. ఉద్యో గంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని దాటుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది.. ఉన్నత వర్గాలతో పరిచయాలు ఏర్పడతాయి.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో రవి ప్రవేశం వల్ల ఈ రాశివారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి, ఆర్థిక సమస్యలు సమసిపోతాయి.
- తుల: ఈ రాశికి లాభాధిపతి అయిన రవి దశమ స్థానంలోకి రావడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
- వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతిగా అత్యంత శుభుడైన రవి భాగ్య స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పాటు పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడానికి లేదా పెళ్లి జరగడానికి అవకాశం ఉంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందు తాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారు అక్కడే స్థిరపడే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Also Read: శని కటాక్షంతో త్వరలో ఈ రాశులకు గోల్డెన్ డేస్.. మీ జాతకం మారుతోంది భయ్యా..!
Follow Us