Success Astrology: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆ రాశులకు సక్సెస్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

జ్యోతిష్య శాస్త్రంలో మూడవ స్థానాన్ని ప్రయత్నం, చొరవ, ధైర్యం, వృద్ధికి ప్రతీకగా భావిస్తారు. తృతీయ స్థానం బలంగా ఉన్నప్పుడు కొద్దిపాటి ప్రయత్నంతోనే ఆశయాలు, కోరికలు, లక్ష్యాలను సాధించే అవకాశాలు ఉంటాయని జ్యోతిష్య నమ్మకం. ప్రస్తుతం మేషం, వృషభం, మిథునం, సింహం, ధనుస్సు, మకర రాశులకు తృతీయ స్థానం అనుకూల గ్రహాల ప్రభావంతో బలంగా ఉందని అంచనా. దీంతో ఆర్థికం, ఉద్యోగం, వివాహం, విదేశీ ప్రయాణం వంటి విషయాల్లో స్వల్ప ప్రయత్నానికే మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది.

Success Astrology: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆ రాశులకు సక్సెస్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
Success Astrology

Edited By:

Updated on: Aug 24, 2026 | 7:00 PM

ప్రయత్నం, వృద్ధి, చొరవ, తెగువ వంటి లక్షణాలు కలిగిన మూడవ స్థానం బలంగా ఉన్న పక్షంలో కొద్దిపాటి ప్రయత్నంతో ఆశయాలను, ఆశలను, కలలను, కోరికలను సాకారం చేసుకునే అవకాశం కలుగుతుంది. మూడవ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి, మనసులోని కోరికలు తీరడానికి కొన్ని రాశులకు అవకాశం కలుగుతోంది. మేషం, వృషభం, మిథునం, సింహం, ధనుస్సు, మకర రాశులకు తృతీయ స్థానం అనుకూల గ్రహాలతో బాగా బలంగా ఉన్నందువల్ల ఆర్థికం, ఉద్యోగం, పెళ్లి, విదేశీయానం తదితర అంశాలకు సంబంధించి వీరు కొద్దిగా ప్రయత్నించినా అనుకూల ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది.

మేషం

ఈ రాశికి ప్రస్తుతం తృతీయ స్థానంలో రాశ్యధిపతి కుజుడి సంచారం వల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో అనేక విధాలుగా పురోగతి చెందడానికి అవకాశం ఉంది. వీరి మనసులోని ముఖ్యమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభ్యమవుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని ఫలితాలు సాధిస్తారు.

వృషభం

ఈ రాశివారికి తృతీయ స్థానంలో అత్యంత శుభ గ్రహమైన గురువు ఉచ్ఛస్థితిలో అక్టోబర్ 31 వరకూ సంచారం చేస్తున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో కోరుకున్నదల్లా సిద్ధిస్తుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విశేష లాభాలని స్తాయి. ఆర్థిక సమస్యలు, వివాదాలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలతో సహా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం

ఈ రాశికి తృతీయ స్థానంలో రవి, బుధ, కేతువులు సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నమైనా సక్సెస్ అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడానికి బాగా అవకాశం ఉంది. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా డిసెంబర్ 5 లోగా నూరు శాతం శుభ ఫలితాలనిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కు తాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల, సొంత ఇంటి కల తప్పకుండా ఫలిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

సింహం

ఈ రాశికి తృతీయ స్థానంలో సెప్టెంబర్ 3 నుంచి శుక్ర గ్రహ స్వస్థాన సంచారం వల్ల ఉద్యోగ ప్రయ త్నాల్లో ఘన విజయాలు కలుగుతాయి. ఆదాయంలో బాగా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. విదేశీయానానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలకు, విదేశాల్లో స్థిరపడడానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ పూర్తిగాకలిసి వస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది.

ధనుస్సు

ఈ రాశికి తృతీయ స్థానంలో డిసెంబర్ 5 వరకు రాహువు సంచారం చేయడం వల్ల కొద్ది ప్రయ త్నంతో విశేష ఫలితాలు కలుగుతాయి. జీవితంలో సానుకూల మలుపులు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం విజయాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యు లేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

మకరం

ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి శనీశ్వరుడి సంచారం వల్ల అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందడంతో పాటు, స్వల్ప ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. గృహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. మధ్య వర్తిత్వాలు, కౌన్సెలింగులు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us