
2025 సంవత్సరంలో పితృపక్ష అమావాస్య రోజునే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే భారత దేశంలో కనిపించదు. కానీ జ్యోతిష్య ప్రకారం , ఈ సూర్య గ్రహణం రాశులను మాత్ర ప్రభావితం చేస్తుంది. కన్యా రాశిలో సూర్యగ్రహణం ఏర్పడటం , శని తిరోగమణంలో ఉండటం వీటన్నింటి ప్రభావం 12 రాశులపై పండుతుంది. అందులో నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు కలిసొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కుంభ రాశి : కుంభ రాశి వారి జీవితాల్లో సూర్యగ్రహణం కొత్త వెలుగులు తీసుకొస్తుంది. ఈ రాశి వారి ఉద్యోగులకు ఆఫీసులో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కెరీర్ పరంగా ఉన్న ఒడిదొడుకులు తగ్గిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరనం నెలకొంటుంది. ఆనందంగా జీవిస్తారు.

వృషభ రాశి : వృషభ రాశి వారికి పితృపక్షంలో సూర్య గ్రహణం ఏర్పడటం వలన వీరికి కలిసి వస్తుంది. కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుంది. మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంభ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

మిథున రాశి : మిథున రాశి వారికి సూర్య గ్రహణం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ సమయంలో చాలా ఆనందంగా జీవిస్తారు. ఎవరైతే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలని చూస్తున్నారో, వారి కోరిక నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు, కలిసి వస్తుంది.

మకర రాశి :మకర రాశి నుంచి సూర్య గ్రహణం మూడో స్థానంలో ఏర్పడనుంది. ఈ సమయంలో వీరు చాలా దృఢంగా ఉంటారు. ధైర్యం పెరుగుతుంది. వ్యాపారంలో అనేక లాభాలు అందుకుంటారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఇది మంచి సమయం, ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. అన్ని రంగాల్లో అద్భుతంగా ఉంటుంది.