Success Astrology: గ్రహాల అనుకూలత..వీరికి ప్రయత్నిస్తే సక్సెస్ పక్కా..!

Telugu Astrology: గ్రహాల అనుకూలతతో కొందరికి ప్రయత్నాలన్నీ విజయవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సరైన లక్ష్యాలను ఎంచుకుని ముందడుగు వేస్తే కెరీర్, ఆర్థికం, వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలు పొందవచ్చు. ఇంతకీ తృతీయ స్థానం లేదా తృతీయ స్థానాధిపతి అనుకూలంగా ఉన్నందు వల్ల ప్రయత్న లాభం కలిగే అవకాశం ఉన్నఆ ఆరు రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

Success Astrology: గ్రహాల అనుకూలత..వీరికి ప్రయత్నిస్తే సక్సెస్ పక్కా..!
Success Astrology

Edited By:

Updated on: Nov 24, 2026 | 10:47 AM

గ్రహాల స్థితిగతులను బట్టి ఏ దిశలో, ఏ రంగంలో ప్రయత్నాలు సాగించడం మంచిదో తెలుసుకో వచ్చు. ముఖ్యంగా తృతీయ స్థానం, తృతీయ స్థానాధిపతిని బట్టి ప్రయత్నాలు, లక్ష్యాలు, ఆశయా లను, అవి నెరవేరుతాయా లేదా అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత గ్రహ స్థితిని బట్టి కొన్ని రాశులవారు తమ విలువైన కాలాన్ని వృథా చేయకుండా సరైన లక్ష్యాలను నిర్దేశించుకుని, సరైన ప్రయత్నం చేయడం వల్ల ఉపయోగం పొందే అవకాశం ఉంది. మేషం, మిథునం, సింహం, తుల, మకరం, కుంభ రాశులవారికి తృతీయ స్థానం లేదా తృతీయ స్థానాధిపతి అనుకూలంగా ఉన్నందు వల్ల ప్రయత్న లాభం కలిగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి తృతీయ స్థానాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉండి ఈ రాశిని వీక్షిస్తున్నందువల్ల ఈ రాశివారికి షేర్లు, స్పెక్యులేషన్లు, ఒప్పందాలు, ఫోన్ సంభాషణలు, మెసేజ్ లు, పరిచయాలు బాగా లాభిస్తాయి. ఈ రాశివారు దాదాపు డిసెంబర్ చివరి వరకు ఈ అంశాల్లో ప్రయత్నాలు సాగించడం మంచిది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. తప్పకుండా లక్ష్యాలు, ఆశయాలను నెరవేరుతాయి. ఇక నుంచి అంచనాల్ని మించిన అభివృద్ధి, పురోగతి ఉంటాయి.
  2. మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో గురు, కుజ, కేతువులు ఉన్నందువల్ల మరో మూడు నెలల పాటు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. కొత్త లక్ష్యాలు, ఆశయాలకు శ్రీకారం చుట్టడం మంచిది. చొరవ, ఆత్మ విశ్వాసం వృద్ధి చెందుతాయి. ప్రముఖులతో లాభదాయక ఒప్పందాలు చోటు చేసు కుంటాయి. కొద్దిపాటి మార్పులతో ఆదాయం వృద్ధి చెందడంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఉత్తమ ఫలితాల్ని అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ పరిస్థితి బాగా మెరుగుపడతాయి.
  3. సింహం: ఈ రాశికి తృతీయ స్థానంలో బుధ, శుక్ర, రవులు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు, కాంట్రాక్టులకు, ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు సాగించడం చాలా మంచిది. వీరి లక్ష్యాలు, ఆశయాలు, కలలు తప్పకుండా సాకారమవుతాయి. తమకు సంబంధిం చిన రంగంలో తప్పకుండా పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పురోగతి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. షేర్లు బాగాలాభిస్తాయి.
  4. తుల: ఈ రాశికి తృతీయ స్థానాధిపతి అయిన గురువు లాభ స్థానంలో కుజుడితో కలిసి ఉండడం వల్ల రాజకీయ ప్రాబల్యం పెరగడానికి బాగా అవకాశం ఉంది. ఈ దిశలో ప్రయత్నాలు సాగించడం చాలా మంచిది. వృత్తి, వ్యాపారాలను విస్తరించాలన్న ఆశయం నెరవేరుతుంది. మరింత మంచి ఉద్యోగం లోకి మారడానికి, విదేశీ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యో గులు పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో శని సంచారం వల్ల ఆర్థికాభివృద్ధి సంబంధమైన ఆశయాలు, కలలు నెరవేరుతాయి. ఆదాయ వృద్ధికి గట్టి ప్రయత్నాలు సాగించడం మంచిది. ఆర్థిక అవసరాలు తీరిపో వడమే కాక, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కొద్ది ప్రయత్నంతో వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. అదనపు ఆదా యానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశీ ఉద్యోగం చేయాలన్న కోరిక తీరుతుంది.
  7. కుంభం: ఈ రాశికి తృతీయాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో గురువుతో కలిసి ఉండడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. సంపన్నుడు కావాలన్న చిరకాల ఆశయం తీరుతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా మంచి పురోగతి ఉండడంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టే పెట్టు బడులు బాగా లాభిస్తాయి. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని యాక్టివిటీ ఉంటుంది. ఉద్యో గంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగాలకు ఆఫర్ అందుతుంది.
Loading...
Unable to load recommendations.
Follow Us