Birth Star Astrology: అనుకూలంగా శని, శుక్ర గ్రహాలు.. ఆ జన్మ నక్షత్రాల వారికి విపరీత రాజ యోగం..!

| Edited By: Janardhan Veluru

Mar 31, 2024 | 10:28 PM

గ్రహ సంచారంలో ప్రస్తుతం శని, శుక్రులు చాలా బలంగా ఉన్నాయి. శనీశ్వరుడు తన స్వక్షేత్రం, మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలోనూ, శుక్రుడు తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలోనూ సంచారం చేస్తున్నందువల్ల, ఈ గ్రహాలకు చెందిన నక్షత్రాలు కూడా బలం సంతరించుకోవడం జరుగుతుంది. శనికి సంబంధించిన నక్షత్రాలైన..

Birth Star Astrology: అనుకూలంగా శని, శుక్ర గ్రహాలు.. ఆ జన్మ నక్షత్రాల వారికి విపరీత రాజ యోగం..!
Birth Star Astrology
Follow us on

గ్రహ సంచారంలో ప్రస్తుతం శని, శుక్రులు చాలా బలంగా ఉన్నాయి. శనీశ్వరుడు తన స్వక్షేత్రం, మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలోనూ, శుక్రుడు తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలోనూ సంచారం చేస్తున్నందువల్ల, ఈ గ్రహాలకు చెందిన నక్షత్రాలు కూడా బలం సంతరించుకోవడం జరుగుతుంది. శనికి సంబంధించిన నక్షత్రాలైన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్రలు, శుక్రుడికి చెందిన భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు అత్యంత శుభ ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. ఈ నక్షత్రాల వారికి ఆదాయ యోగం, అధికార యోగం తప్పకుండా పడతాయి.

  1. భరణి: శుక్ర గ్రహానికి చెందిన ఈ నక్షత్రం మేష రాశిలో ఉన్నప్పటికీ, అనేక శుభ ఫలితాలను అనుభవిం చడం జరుగుతుంది. ఎక్కువగా శుభ వార్తలు వినే అవకాశముంటుంది. మంచి శుభ పరిణా మాలు చోటుచేసుకుంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగు తాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  2. పుష్యమి: ఈ నక్షత్రానికి అధిపతి అయిన శనీశ్వరుడు కుంభ రాశిలో బలంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి అష్టమ శని ఫలితం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టి ఒక వెలుగు వెలుగుతారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సకాలంలో సత్ఫలితాలనిస్తుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు బయటపడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలోనే అయిన ప్పటికీ ఆశించిన లేదా అనుకూలమైన ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక, ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది.
  3. పుబ్బ: ఈ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల సహజంగానే ఈ నక్షత్రం వారికి ఉచ్ఛస్థితి పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా సంపన్నుల స్థాయిలో ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అన్నిటా ఆర్థిక లాభాలు కలుగుతాయి. మంచి జీతభత్యాలతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి ఉద్యోగులకు అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
  4. అనూరాధ: ఈ నక్షత్ర అధిపతి అయిన శనీశ్వరుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నందువల్ల ఈ నక్షత్రం వారికి ఏ రంగంలో ఉన్నా అభివృద్దికి, పురోగతికి ఢోకా ఉండదు. ఆర్థికంగానూ, ఉద్యోగపరంగానూ ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. అర్ధాష్టమ దోషం కూడా అంటదు. ఆస్తి కలిసి రావడం, ఆస్తి విలువ పెరగడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో చేరిన నాటి నుంచి అనుకూలతలు ఏర్పడతాయి. తల్లి తండ్రులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
  5. పూర్వాషాఢ: శుక్ర గ్రహానికి సంబంధించిన నక్షత్రం అయినందువల్ల ఈ నక్షత్రం వారికి అనేక విధాలుగా ఉచ్ఛ దశ పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లబిస్తుంది. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. ప్రేమ ల్లోనూ, పెళ్లి ప్రయత్నాల్లోనూ విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది.
  6. ఉత్తరాభాద్ర: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు స్వక్షేత్రంలో, అందులోనూ మూల త్రికోణ రాశిలో ఉన్నం దువల్ల మనసులోని కోరికలు క్రమంగా నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారానే కాకుండా అనేక విధాలుగా ఆదాయం పెరుగు తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగు తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ఇష్టమైన పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.