Saturn Transit: 30 ఏళ్ల తర్వాత మీన రాశిలో శని సంచారం.. ఈ రాశుల వారికి అదృష్టం.. పెళ్లి, విదేశీ యోగం

Shani gochar Pisces: దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. మార్చి 13న సాయంత్రం 7.13 గంటలకు ఈ సంచారం జరుగుతోంది. దీని ప్రభావం 3 రాశులకు సానుకూల శక్తిని, అదృష్టాన్ని తీసుకొస్తుంది. శని సంచారం వల్ల లాభం పొందుతున్న ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Saturn Transit: 30 ఏళ్ల తర్వాత మీన రాశిలో శని సంచారం.. ఈ రాశుల వారికి అదృష్టం.. పెళ్లి, విదేశీ యోగం
Shani Dev

Updated on: Jan 30, 2026 | 11:35 AM

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఆయా రాశులను మారుస్తూ ఉంటాయి. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయ వ్యవధిలో తన రాశిని మార్చడం సాధారణమే. గ్రహాల కదలికలు ఆయా రాశులపై మంచి, చెడు ప్రభావాలను చూపిస్తుంటాయి. తొమ్మిది గ్రహాలకు అధిపతిగా పరిగణించబడే శని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సంచారం చేస్తాడు. దాదాపు 30 నుంచి 40 రోజులు ఒకేరాశిలో ఉంటాడు. ఆ విధంగా దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. మార్చి 13న సాయంత్రం 7.13 గంటలకు ఈ సంచారం జరుగుతోంది. దీని ప్రభావం 3 రాశులకు సానుకూల శక్తిని, అదృష్టాన్ని తీసుకొస్తుంది. శని సంచారం వల్ల లాభం పొందుతున్న ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ధనుస్సు రాశి

మీన రాశిలో శని సంచారం ధనుస్సు రాశి వారికి శుభాన్ని చేకూరుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు కోరుకున్న స్థానానికే మారే అవకాశం ఉంది. వారి ప్రతిభను ప్రదర్శించేందుకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించబోయే వారికి ఇది మంచి సమయం అవుతుంది. ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు తమ చదువులో పురోగతి సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. భార్యాభర్తలిద్దరూ కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

కుంభరాశి

శని సంచారం కుంభరాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆకస్మాత్తుగా డబ్బు వస్తుంది. దీని కారణంగా మీరు పాత అప్పులు తీరుస్తారు. ఆస్తి విషయంలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. పనిలో మీకున్న సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలోని ఆర్థిక సంక్షోభాలు తగ్గిపోతాయి. మీ కెరీర్‌లో ఆశించిన లాభం ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడి నుంచి ఎక్కువ లాభం పొందుతారు.

మీనరాశి

మీనరాశిలో శని సంచారంతో వీరికి సంపద, కీర్తిని తెస్తుంది. మీ కుటుంబంలో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు మార్చి నుంచి పరిష్కారమవుతాయి. మీరు పాత అప్పులు తీరుస్తారు. ఆస్తి మంచి ధరకు అమ్ముడవుతుంది. వ్యాపారంలో ఉన్న వారికి పురోగతి, లాభాలు ఉంటాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. మీరు ఇల్లు, నగలు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వివాహం కాని వారికి త్వరలో మంచి సంబంధం దొరుకుతుంది.